BigTV English

Former Cm Jagan: రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా? రివర్స్ లో వెళ్తుందా? మాజీ సీఎం జగన్ ఆరోపణలు

Former Cm Jagan: రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా? రివర్స్ లో వెళ్తుందా? మాజీ సీఎం జగన్ ఆరోపణలు

YS Jagan counter on white papers(Political news in AP): ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై మాజీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా? రివర్స్ లో వెళ్తుందా? అని మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో అందరూ ఆలోచించాలన్నారు.


రాష్ట్రంలో భయానక వాతావరణ నెలకొందన్నారు. దాడులు, అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. ఇంతగా విధ్వంసాలు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రశ్నించే వారిని అణచివేసే ధోరణితో పాలన సాగుతోందన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయలేక బడ్జెట్ పెట్టడం లేదని జగన్ చెప్పారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. బడ్జెట్ లో లెక్కలు చెప్పాల్సి వస్తుందనే రెగ్యులర్ బడ్జెట్ పెట్టడం లేదని విమర్శలు చేశారు.


రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మీడియాతో వెల్లడించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రూ.14లక్షల కోట్ల అప్పు ఉందని ఊదరగొట్టారని, లేని అప్పులను ఉన్నట్లు చూపించడం ధర్మమేనా ? అని జగన్ వివరించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 5 లక్షల 18వేల కోట్లు

చంద్రబాబు హాయంలో 21.63 శాతం అప్పు చేశారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో 12.9శాతం మాత్రమేనని వెల్లడించారు. ఈ విషయంలో గవర్నర్ ను కూడా తప్పుదోవ పట్టించారని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×