BigTV English

White Paper on Fiancial Status : గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం.. శ్వేతపత్రం విడుదల

White Paper on Fiancial Status : గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం.. శ్వేతపత్రం విడుదల

White Paper on AP Fiancial Status: ఏపీలో ఆర్థిక పరిస్థితిపై, వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. సరైన విధానం లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో.. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. రాజధానిగా హైదరాబాద్ ను కోల్పోవడంతో.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటంతో ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి 46 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వస్తే.. 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం వస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టు ఏపీలో ఉంటే.. దాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉందన్నారు. కంపెనీలు, ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉంటే.. అప్పులు ఏపీకి మిగిలాయని, పునర్విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9,10 సమస్యలు పరిష్కారం కాలేదని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. విభజనలో సేవలరంగమంతా తెలంగాణకు వెళ్తే.. ఏపీకి వ్యవసాయం వచ్చిందని, రాష్ట్రంలో సేవల రంగం అభివృద్ధి చెందితే.. అంతా అభివృద్ధి జరుగుతుందన్నారు. వ్యవసాయం ఎక్కువగా ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఆదాయం తక్కువగానే ఉంటుందని తెలిపారు.

Also Read : పంచాయతీ రాజ్ శాఖపై శ్వేతపత్రం.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప్రకటన


కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులను వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు చంద్రబాబు నాయుడు. 2019-24 మధ్య రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, పన్నులను విపరీతంగా పెంచేశారని, చివరికి చెత్తపై కూడా పన్ను వేశారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో GSDP రూ.6.94 లక్షల కోట్లు తగ్గిందన్నారు. తమది ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వమని, ఇస్తామని చెప్పిన పెన్షన్ ను సకాలంలో అందజేశామని తెలిపారు. 2014-19 లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పనిచేస్తే.. 2019-24 మధ్య రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు.

పోలవరం పూర్తయితే సాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయన్నారు చంద్రబాబు. ఇక ప్రజా అవసరాలకు పట్టిసీమను తెచ్చామని తెలిపారు. అమరావతిలో ఉండే మొదటి అక్షరం A చివరి అక్షరం I అని.. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్ది పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని తెలిపారు. యావత్ ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించే రోజు వస్తుందని పేర్కొన్నారు.

2014-18 మధ్యకాలంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తెచ్చామని వివించారు. 16 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలను కుదుర్చుకున్నామని, రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమలు పనులు కూడా ప్రారంభించాయని తెలిపారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×