BigTV English

RK Roja Controvers: తిరుమల కొండపై.. ఇవేం పనులు రోజా?

RK Roja Controvers: తిరుమల కొండపై.. ఇవేం పనులు రోజా?
Advertisement

Former minister RK Roja Controversy: మాజీ మంత్రి, వెటరన్ యాక్టర్ రోజా ఓటమి తర్వాత ఎట్టకేలకు జనంలోకి వచ్చారు. వైసీపీ ఓటమిపై తనదైన శైలిలో విశ్లేషించారు. తమ ప్రభుత్వం చేసిన మేలు ఎవరూ చేయలేదని .. ఓటర్లు తమకు ఓటు వేసినా ఓడిపోయామని.. ఓటమికి కారణాలు త్వరలో బయటపడతాయని చెప్పుకొస్తున్నారు. తాజాగా పుత్తూరులో పర్యటించి తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్న ఆమె జగన్ తరహాలోనే .. అవ్వతాతల ఓట్లు ఏమైపోయాయో తెలియడం లేదన్నట్లే మాట్లాడుతున్నారు. తాను పార్టీ మారతానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె.. స్వామివారి సన్నిధిలో రేపులు, మర్డర్లు గురించి మాట్లాడి ఎప్పటిలాగే వివాదంలో చిక్కుకున్నారు.


సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. దానిపై తొలిసారిగా ఆమె స్పందించారు. తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనని కొట్టి పారేశారు. పార్టీలో నుంచి వెళ్లిపోతున్న నేతలతో తన జగనన్నకు ఎలాంటి నష్టముండదని సెలవిచ్చారు

వైసీపీ నుంచి బయటకొస్తే రోజాకు ఏపీలో ఏ పార్టీలో ఎంట్రీ ఉండదనేది అందరికీ తెలిసిందే.. అధికారంలో ఉన్న అయిదేళ్లు విపక్ష నేతల్లో ఎవరినీ వదలకుండా అంతలా చెలరేగిపోయారామె. తమిళనాట కూడా ఏ పార్టీ దగ్గరకు రానీయలేదేమో?  మళ్లీ జగనన్న జపం మొదలుపెట్టిన నగరి మాజీ ఎమ్మెల్యే.. పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలవుతున్నారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రభుత్వం సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేపులు, హత్యలు పెరిగిపోయాయంటున్నారు.


మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్దం చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి భక్తులే అన్న ప్రచారం జరుగుతుంది. దానిపై అటు పోలీసులు ఇటు సీఐడి తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నాయి. మరి మదనపల్లి ఫైల్స్ ఘటన మూడు నెలలుగా ఎవరికీ కనిపించని రోజాకు ఎందుకు గుర్తొంచిందో కాని తిరుమల దర్శనానికి ముందు పుత్తూరు వెళ్లిన ఆమె.. అక్కడ బలిజ భవన్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటికే స్థానిక శాసన సభ్యుడు గాలి భాను ప్రకాష్ ఓ సారి దాన్ని ప్రారంభించారు. తాజాగా మన మాజీ మంత్రిగారు మళ్లీ ఓపెన్ చేశారు. ఆ సందర్భంగా ఆమె తమ ఓటమికి కొత్త విశ్లేషణలు చెప్పుకొచ్చారు.

Also Read: జగన్‌కు, చంద్రబాబుకు మధ్య తేడా లేదనిపిస్తుంది.. ఎందుకంటే? : షర్మిల సంచలన వ్యాఖ్యలు

అసలు ప్రజలంతా తమ వైపు ఉన్నా ఓడిపోయాయని కొత్త పలుకులు పలికారు. తాము కాని తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాని ఎవ్వరినీ బాధించలేదని.. అసలు ఎలాంటి కష్టం రాకుండా ప్రజలను చూసుకున్నామని రోజా అంటోంది. ఓటమి గల అసలైన కారణం త్వరలో బయటపడుతుందంట. రోజా మాటలపై వైసీపీలోని సీనియర్లతో పాటు స్థానిక నేతలు అంతర్గతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా 2019 నుంచి 24 మద్య కాలంలో రోజా అండ్ కో వ్యవహారించిన తీరుతో పార్టీ ప్రతిష్ఠ నియోజకవర్గంలో దిగజారి పోయిందని అంటున్నారు.

నగరి నియోజకవర్గంలో చరిత్ర తీసుకుంటే ఏ పార్టీ అయినా అక్కడ కేవలం ఐదు వేల లోపు మెజార్టీతోనే గెలిచింది. రోజా మాత్రం ఏకంగా నలభై వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు… దానికి కారణం అమె గత ఐదు సంవత్సరాలుగా చేసిన నిర్వాకాలే అంటున్నారు. పార్టీ అవిర్బవావం నుంచి పనిచేసిన వారందరిని ఏమాత్రం పట్టించుకోకుండా భర్త, సోదరులు. పిఏ లాంటి భజన పరులతో పెత్తనం చేయించి… కోట్లు కొల్లగొట్టారని రోజాపై ఆరోపణలున్నాయి.

నగరిలో వైసీపీ సీనియర్లు అయిన కెజె శాంతి కూమార్‌తో పాటు ఎన్నికల ముందు పార్టీ మారిన చక్రపాణి రెడ్డి, అమ్ములు, మురళీరెడ్డి, విజయపురం మండలానికి చెందిన రాజు లాంటి వారంతా పార్టీకి దూరమయ్యారు. రోజా ఓడిపోయిన తర్వాత వైసీపీకి దరిద్రం వదిలిపోయిందని నగరి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శాంతి సెల్పీ వీడియో విడుదల చేసారు.  దాన్ని బట్టే నగరి వైసీపీలో రోజా అంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతుంది. ఇక మాజీ మంత్రిపై అడదాం ఆంధ్ర తో నిధుల దుర్వినియోగంతో పాటు, రుషికొండ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీఐసీసీ భూసేకరణతో పాటు టీటీడీ ఇండ్ల స్థలాలకు ఇచ్చిన భూముల వ్యవహారం, ఇసుక దందాలు క్యారీ లీజులు,రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి.

దీనికితోడు తమిళనాడు ఆలయం లో పారిశుద్ధ్య కార్మికుల ను దూరం జరగమనడంతో పాటు ప్యారీస్ టూర్ పొట్టి బట్టలు లాంటి వ్యవహారాలతో అభాసుపాలయ్యారు. తాజాగా కొండపై కూడా అభిమానులు సెల్ఫీల కోసం ప్రయత్నిసుంటే ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూడండి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగొలుగా మాట్లాడటమే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకోవడంతో డ్యాన్స్ చేసిన చరిత్ర రోజాది. నారాలోకేష్ తో పాటు భువనేశ్వరి, నారా బ్రహ్మణితో పాటు , పవన్‌కళ్యాణ్, వారి కుటుంబ సభ్యుల మీద ఇష్టాను సారం మాట్లాడిన రోజా ఇప్పుడు తనను ట్రోల్ చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద అవేదన వ్యక్తం చేస్తుందంట. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే నియమం ఉన్నా దాన్ని అతిక్రయించిన ఆమె.. అప్పట్లో ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు భాదపడితే పలితం ఏంటని నగరి ప్రజలు చురకలు అంటిస్తున్నారు.

Related News

Pithapuram Politics: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Big Stories

×