Free Medical Treatment: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, రూ. 5 లక్షల సాయం పొందే అవకాశం ఉన్నట్లు మీకు తెలుసా.. ఔను ఈ అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంతకు ఈ సదుపాయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.
ఆరోగ్యమే మహాబలం అంటారు. అలాంటి ఆరోగ్యం ఎప్పుడు క్షీణిస్తుందో, ఎప్పుడు సీరియస్ కండీషన్ లోకి మారుతుందో చెప్పలేం. సామాన్య కుటుంబాలకు ఇటువంటి సమస్యలు తలెత్తితే, ఆ ఆర్థిక కష్టాలు ఊహించలేము. ప్రధానంగా ఎక్కువ వయస్సు అంటే సుమారు 60 ఏళ్ళకు పైబడిన వారికి అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి. అలాంటి సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం అయ్యే ఖర్చు అధికం. అందుకే ఇలాంటి వారి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ప్రవేశ పెడుతున్నాయి.
తాజాగా ఏపీలో ఒక స్కీమ్ ను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ స్కీమ్ తో ఎందరో వృద్దులకు ప్రభుత్వం ఆరోగ్య భరోసా కల్పించినట్లు భావించవచ్చు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ PMJAY వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. దీనితో రాష్ట్రంలోని ఎందరో లక్షలాది మంది ప్రజలకు మేలు చేకూరనుంది.
ఒక్క రూపాయి అవసరం లేదు
మీ వయస్సు 70 ఏళ్లకు పైబడి ఉందా? అయితే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అధైర్యపడవద్దు.. మీకు ఏకంగా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందనుంది. అయితే ఆ సాయం ఎలా పొందాలో తెలుసుకుందాం.
Also Read: AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. డేట్ ఫిక్స్ చేసిన సీఎం.. సవాళ్ల సంగతేంటి?
ఎవరెవరు అర్హులు?
వయసు 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి
ప్రయోజనాలు..
రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స
ప్రభుత్వంతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స
పూర్తిగా క్యాష్‌లెస్ సేవలు
ఆదాయ ధ్రువీకరణపత్రం అవసరం లేదు
ఎలా దరఖాస్తు చేయాలి?
https://beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వాలి
“70+ Senior Citizen Registration” అనే ఎంపికను ఎంచుకోవాలి
ఆధార్ ద్వారా e-KYC పూర్తి చేయాలి
కుటుంబ వివరాలు, చిరునామా, మొబైల్ నంబర్ నమోదు చేయాలి
ఫోటో అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి
కార్డు సిద్ధమైన తరువాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
టోల్ ఫ్రీ నంబర్ 1800 11 0770 కు మిస్డ్ కాల్ ఇస్తే, వివరాలన్నీ మీ ముందు ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, రూ. 5 లక్షల సాయం పొందండి సుమా.. మరచిపోవద్దు!