BigTV English
Advertisement

Tilak Varma : సూర్యకు ఎసరు పెడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ !

Tilak Varma : సూర్యకు ఎసరు పెడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ !

Tilak Varma :  టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  సూర్య కుమార్ యాదవ్  భార్య  దేవిషా నిత్యం ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్య బ్యాటింగ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియానికి తరుచూ వెళ్తుంటుంది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ కి కూడా ఆమె వెళ్లింది. అప్పుడు ఓ యంగ్ క్రికెటర్ తో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో స్టాండ్ కి అధికారికంగా రోహిత్ శర్మ పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో సూర్యకుమార్ యాదవ్, దేవిషా హాజరయ్యారు. ఈ సందర్భంలో ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మ.. సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషాతో పలు విషయాలపై చర్చించారు. వీరిద్దరూ ముచ్చటించుకునే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read :  Virat Kohli Fans : కోహ్లీ కి అరుదైన గౌరవం.. చిన్నస్వామి స్టేడియంలో అన్ని 18 జెర్సీలే

కొందరూ నెటిజన్లు తిలక్ వర్మ మామూలోడు కాదుగా.. ఏకంగా తన తోటి క్రికెటర్ సూర్యకుమార్ కి ఎసరుపెడుతున్నాడు ఈ తెలుగు కుర్రాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గాసిప్స్ మాత్రం మామూలుగా రావడం లేదు. ఈ వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ ఈ స్టాండ్ ను ఆవిష్కరించడం విశేషం. రోహిత్ శర్మతో పాటు భారత మాజీ కెప్టెన్ అజీత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్లను వాంఖడే స్టేడియంలో స్టాండ్లకు పెట్టారు. గతంలో కూడా వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్ సర్కార్ల పేరిట స్టాండ్లు ఉన్నాయి. ఇక ఈ సందర్భంగా రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. టీమిండియా తరపున వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో ఆడాలని ఉందని వెల్లడించాడు రోహిత్ శర్మ. వాంఖడే స్టేడియంలో ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని గుర్తు చేసుకున్నాడు. 


ముంబై ఇండియన్స్ జట్టు లో ప్రస్తుతం రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి క్రీడాకారులు ఆడుతున్నారు. ఈ సీజన్ లో ముంబై జట్టు తొలుత కాస్త గాడి తప్పినప్పటికీ.. మళ్లీ పుంజుకొని రేస్ లోకి వచ్చింది. చివరి రెండు మ్యాచ్ లు ముంబై జట్టుకు చాలా కీలకం కానున్నాయి. పంజాబ్ కింగ్స్ తో ఒక మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ తో మరో మ్యాచ్ రెండు మ్యాచ్ ల్లో కచ్చితంగా విజయం సాధిస్తే.. ఇక ముంబై కి తిరుగుండదు. ఈ రెండింటిలో ఏ ఒక్క మ్యాచ్ ఓడినా మిగిలిన జట్ల పై ఆధారపడాల్సి వస్తుంది. ప్లే ఆప్స్ కి చేరువవ్వాలంటే కీలక మ్యాచ్ ల్లో విజయం సాధించాలి. గత ఏడాది ముంబై ఇండియన్స్ కి చేదు అనుభవం ఎదురైంది. గతేడాది ముంబై 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం పదో స్థానంతో సీజన్ ను ముగించింది. ఈ సీజన్ లో పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులతో ఆరేంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు.

?igsh=aGplZWlmbWgwcjJo

Related News

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Big Stories

×