Aishwarya Rajesh: సినీబ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్‌తోనే ఎదిగింది ఐశ్వర్య రాజేష్. తెలుగమ్మాయి కావడం, కలర్ తక్కువ ఉండటంతో కెరీర్ ఆరంభంలో చాలా స్రగ్గుల్స్ ఫేస్ చేసింది.. అలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.. ఈ ఏడాది నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా ఆమె ఖాతాలో పడిపోయింది. అయితే ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు కానీ బయట ఎక్కువగా సందడి చేస్తుంది.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ వస్తుంది. తాజాగా ఓ నగల దుకాణాన్ని ఓపెన్ చేసింది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
లాబ్-గ్రోన్ ఆభరణాల బ్రాండ్ స్టోర్ ప్రారంభం..
వజ్రా భరణ రంగంలో తనదైన ముద్రవేసిన లాబ్-గ్రోన్ వజ్రా ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియ విజయవాడ నగరంలో తన నాలుగవ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించింది. సరికొత్త వజ్ర ఆభరణాలతో కొనుగోలు దారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియ స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ తో వజ్రాభరణ ప్రియులకు స్వాగతం పలుకుతుంది,. ఎన్నో రకాల కలెక్షన్స్ ను అందిస్తుంది. అయితే ఈ స్టోర్ ను ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడలో ప్రారంభించారు. ఈ స్టోర్ ను టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు.. విజయవాడ బందర్ రోడ్ లోని పివిఆర్ స్టోర్ నందు భారతదేశంలోనే అతిపెద్ద లాబ్-గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియ తన నాల్గవ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందనీ,ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆభరణాలను తమకు కావాల్సిన డిజైన్ లో చేయించుకుంటున్నారనీ అన్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందనీ,కొనుగోలు దారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియ స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తుందన్నారు. తనకు బంగారు వజ్ర ఆభరణాలు అంటే ఎంతో ఇష్టం అని, నేను ఈ స్టోర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ అంటే కూడా తనకు చాలా ఇష్టమని, తనకు ఇష్టమైన విజయవాడ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో రెండు సినిమాలలో నటించబోతున్నట్లు చెప్పారు. తమిళ సినిమాలు కూడా ఆఫర్లు ఉన్నాయని, తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డైమండ్ గ్రేడింగ్‌లో సర్టిఫికేషన్‌లో గ్లోబల్ అథారిటీ అయిన IGI నుండి ధృవపత్రాలు ఉన్నాయని అన్నారు. క్యారెట్ డైమండ్ ధర రూ. 24,999 ((EF – VVS) నుండి ప్రారంభమై విభిన్న కలెక్షన్ల శ్రేణిలో లభిస్తుందన్నారు.మే 17 నుండి మే 25, 2025 వరకు డైమండ్స్, మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15 శాతం వరకు తగ్గింపు, ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్‌ను లాడియ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు..
ఐశ్వర్య రాజేష్ సినిమాల విషయానికొస్తే..చేతిలో దాదాపు అర డజన్ కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ, అందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. కథల ఎంపికలో సెలక్టివ్ గా ఉండే ఐశ్వర్యకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదా? లేక వచ్చిన ఆఫర్లు నచ్చడం లేదా? అన్నది తెలియాల్సి ఉంది.