Tirumala News: దసరా బ్రహ్మోత్సావాల సీజన్ దగ్గరపడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. ప్రతీ ఏటా భక్తులు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తోంది టీటీడీ. సేవ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఆ వివరాలను ఒక్కసారి చూద్దాం.
తిరుమల పేరు చెప్పగానే మనసు పులకరిస్తుంది. శ్రీవారిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు వేలాదిమంది భక్తులు. ప్రతీ రోజూ ఏడు కొండలకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు సేవలు చేసేందుకు శ్రీవారి సేవకులకు అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సేవ చేసేందుకు భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే శ్రీవారి సన్నిధిలో సేవ చేయాలంటే ఏం చేయ్యాలి? ఎలా అప్లై చేయాలి? ఇలాంటి విషయాలు చాలామందికి తెలీదు.
తిరుమలలో సేవలు చేయాలనుకునే వారికి అరుదైన అవకాశం కల్పిస్తోంది టీటీడీ. అందుకోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆ బుకింగ్ ఫామ్ తీసుకుని తిరుమలకు వస్తేచాలు, ఆ ఫామ్‌లను గ్రూప్ సూపర్‌వైజర్లు పరిశీలన చేస్తారు. సేవకులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత ఆధార్ కార్డు, అడ్రస్, బుకింగ్ ఐడీ ఫామ్‌లు, ఫోటో అప్డేట్ వంటివి చెక్ చేస్తారు. అంతా ఓకే అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరకు వెళితే వారు చేయాల్సిన రిజిస్ట్రేషన్ చేస్తారు.
ఆ తర్వాత లాకర్ స్లిప్ ఇస్తారు, దాన్ని తీసుకుని FMS దగ్గరకు వెళ్తే లాకర్, కీ ఇస్తారు. రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్తే పౌచ్, ట్యాగ్, స్కార్ఫ్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత వాటిని తీసుకుని మరొక ప్రాంతానికి వస్తారు. తిరుమలలో సేవ చేయడానికి వచ్చే వ్యక్తులు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అందుకు నియమ నిబంధనల గురించి వివరిస్తారు. కొండపై ఎక్కడెడక్కడ సేవలు అందించాలి? భక్తులతో ఎలా మెలగాలి? ఉద్యోగులతో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలను సత్సంగంలో వివరిస్తారు. సత్సంగంలో భజన, యోగా, ధ్యానం ఉంటుంది. ఇదే కాకుండా సేవకులకు రామాయణం, మహా భారతం, భగవద్గీతలోని అంశాలను వివరిస్తారు.
ALSO READ: నిర్మాణం ఓకే.. కానీ రిస్క్ మీదే! విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సంచలన తీర్పు
తిరుమల శ్రీవారి సేవకులకు లక్కీ డిప్ లేకుంటే ర్యాండమ్ పద్ధతిలో ఆలయంలో డ్యూటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్లు శ్రీవారి సన్నిధిలో సేవలు అందించాలి. తిరుమలలో 39 చోట్ల సేవలు ఇవ్వాల్సి ఉంటుంది. సేవకుల కోసం టీటీడీ రూ.120 కోట్లతో భవనాన్ని నిర్మించారు. శ్రీవారి సేవా సదన్-1, శ్రీవారి సేవా సదన్-2 ఉన్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంటాయి. అక్కడ శ్రీవారి సేవకులు వారం పాటు ఉండవచ్చు, వారికి వసతి కల్పిస్తారు. సీఆర్వో కార్యాలయంలో సేవలు అందించాల్సి ఉంటుంది.
Srivari Sevaks from various states across India arrive at Tirumala after registering for Srivari Seva. Group supervisors guide them through the necessary formalities and provide detailed information about accommodation, seva duties, and other facilities to ensure a smooth and… pic.twitter.com/6QTfEWjM1i
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 6, 2026