Tirumala News: తిరుమలకు వచ్చే భక్తుల కోసం రకరకాల నిర్ణయాలు తీసుకుంటోంది టీటీడీ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఏ విషయంలో ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతోంది. తాజాగా మరొక కబురు చెప్పింది. జనతా క్యాంటీన్లలో క్వాలిటీ ఆహారం అందించాలని అధికారులకు సూచించారు టీటీడీ ఈవో.
తిరుమలకు ప్రతీ రోజూ భక్తులు లక్షల్లో వస్తుంటారు. దర్శనాలు చేసుకుని వెళ్లేవారు వేలల్లో ఉంటారు. దర్శనాల మాట కాసేపు పక్కనబెడితే.. కొండపై ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని భక్తులు చాన్నాళ్లు టీటీడీ దృష్టికి తెస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు మాత్రమే, షరా మామూలే.
తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటోంది టీటీడీ. సమయం ప్రకారం భక్తులకు టిఫిన్ అందజేస్తోంది టీటీడీ. మిగతా సమయాల్లో కొండకు వచ్చి భక్తులు ప్రైవేటు హాటళ్లను ఆశ్రయించాల్సి వుంటుంది. తిరుమల కొండపై ఆహారం ధరలు దారుణంగా ఉన్నాయంటూ పలు సందర్భాల్లో భక్తులు టీటీడీ దృష్టికి తెచ్చారు.
బుధవారం టీటీడీ పరిపాలనా భవనంలో గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో కలిసి ఈవో శ్యామలరావు సమావేశం అయ్యారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటీన్ల నిర్వహణ కోసం జూన్ 23న నోటిఫిషన్ ఇచ్చింది. టెండర్లు దాఖలు చేసినవారికి ఫ్రీ బిడ్ మీటింగ్, గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకుల సందేహాలు వ్యక్తం చేశారు.
ALSO READ: ఆ సైకిల్ ఓ వండర్.. తెగ తొక్కేసిన పవన్ కల్యాణ్
తిరుమలకు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా టీటీడీతోపాటు ప్రభుత్వానికి మచ్చగా మిగులుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సేవా దృక్పధంతో నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత నిర్ధేశించిన ధరలకు అందించాలని కోరారు టీటీడీ ఈవో శ్యామలరావు.
నిర్థారించిన నియమాలకు లోబడి.. బిగ్, జనతా క్యాంటిన్‌లలో కేటాయింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సమావేశంలో హోటళ్లకు సంబంధించిన టెండర్ ప్రాసెస్, నియమ నిబంధనలు, హోటళ్ల నిర్వాహకులు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎఫ్‌ఏఓ రవి ప్రసాద్, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు, గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులు ఈ భేటీలో పాల్గొన్నారు.
మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. బుధవారం ఉదయం యాగశాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన వంటివి చేపట్టారు. మధ్యాహ్నం మూడు గంటలకు అభిషేకం, అనంతరం అలంకారం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం పంచమూర్తులైన వినాయక స్వామి, సుబ్రమణ్యస్వామి, కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, చండికేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.