BigTV English

OTT Movie : చుట్టూ చుట్టాలే ఉంటే ఫస్ట్ నైట్ ఎలా ? ఆ పని కోసం రెండు జంటల షాకింగ్ నిర్ణయం

OTT Movie : చుట్టూ చుట్టాలే ఉంటే ఫస్ట్ నైట్ ఎలా ? ఆ పని కోసం రెండు జంటల షాకింగ్ నిర్ణయం
Advertisement

OTT Movie : ఫీల్ గుడ్ సినిమాలను లైక్ చేసే మూవీ లవర్స్ కి, ఓటీటీలో ఒక కన్నడ సినిమా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ బెంగళూరులో 1960ల కాలంలో జరుగుతుంది.  ఒక సాంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో, ఇంటి పెద్ద దిక్కు మరణం తర్వాత ఈ స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా పేరు ‘ఆచార్ అండ్ కో’ (aachar and co). ఈ మూవీలో సింధు శ్రీనివాస మూర్తి (సుమా), అశోక్ (మధుసూదన్ ఆచార్), సుధా బెలవాడి (సావిత్రి), అనిరుధ్ ఆచార్య, హర్షిల్ కౌశిక్, వంశీధర్ భోగరాజు, సోను వేణుగోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఆచార్ అండ్ కో’జూలై 28, 2023న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి సింధు శ్రీనివాస మూర్తి దర్శకత్వం వహించారు. IMDB లో ఈ సినిమాకి 7.8/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ 1960ల బెంగళూరు జయనగర్‌లో, ఒక సాంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మధుసూదన్ (అశోక్) ఒక పీడబ్ల్యూడీ ఇంజనీర్. తన భార్య సావిత్రి (సుధా బెలవాడి) పది మంది పిల్లలతో కలసి నివసిస్తుంటాడు. ఇందులో ముగ్గురు కొడుకులు, ఏడుగురు కూతుర్లు ఉంటారు. మధుసూదన్ తన కొడుకులు ఇంజనీర్లుగా, కూతుళ్ళు గృహిణులుగా ఉండాలని కోరుకుంటాడు. కూతుళ్ళను చదివించడానికి ఇష్టపడడు. ఇక స్టోరీ సుమా (సింధు శ్రీనివాస మూర్తి) అనే అమ్మాయితో టర్న్ అవుతుంది. ఆమె చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడంతో 10వ తరగతిలో ఫెయిల్ అవుతుంది. ఇంతలో మధుసూదన్ చనిపోవడంతో, ఆ కుటుంబం శోకంలో మునిగిపోతుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతుంది.

ఇంట్లో మగవాళ్ళు ఎవరిదారి వాళ్ళు చూసుకోవడంతో, సుమా ఈ కుటుంబ బాధ్యతలను మోయాల్సి వస్తుంది. ఆమె తన ఇంటి పచ్చళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి ‘ఆచార్ అండ్ కో’ అనే వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. ఇది కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. ఈ క్రమంలో సుమా ఒక స్వతంత్ర మహిళగా ఎదుగుతుంది. ఆమె తన చెల్లెళ్ళకు విద్యతో పాటు, ఆధునిక జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. చివరికి ఈ కుటుంబంలో మగవాళ్ళ పాత్ర ఏంటి ? సుమా తన జీవితంలో ఏం నేర్చుకుంటుంది ? ఈ సినిమా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి నేర్చుకోండి.

Read Also : గ్రామాన్ని వల్లకాడు చేసే సైకో కిల్లర్.. బొమ్మ మాస్క్ తో అతి కిరాతకంగా హత్యలు… గ్రిప్పింగ్ నరేషన్

Related News

OTT Movie : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా

OTT Movie : వాష్ రూమ్‌లో వరస్ట్ ఎక్స్పీరియన్స్… ‘విరూపాక్ష’ను మించిన చేతబడి… స్పైన్ చిల్లింగ్ సీన్స్

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్… ఓటీటీలో నెల రోజులుగా ట్రెండ్ అవుతున్న మూవీ… ఇంకా టాప్ 5 లోనే

Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×