Google Office in Vishakaptanam: నారా లోకేష్ వల్లే ఇదంతా సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంతకు లోకేష్ ఏమి చేశారని అనుకుంటున్నారు కదా.. లోకేష్ చేసిన ఒకే ఒక్క పనితో ఏకంగా రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం దక్కింది. ఈ విషయంపై స్పందించిన సీఎం చంద్రబాబు ఇలా కామెంట్స్ చేశారు.
ఏపీ ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య, ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల పెట్టుబడుల సాధన కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన లోకేష్ అక్కడ పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. అక్కడ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంపై చర్చించిన లోకేష్ మళ్లీ రాష్ట్రానికి వచ్చేశారు. అలా లోకేష్ పర్యటన ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏపీకి దక్కుతున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం పూర్తి చేసుకుంది. ఆ ఒప్పందానికి ప్రధాన కారకుడు మంత్రి నారా లోకేష్ అంటూ స్వయాన సీఎం చంద్రబాబు అన్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వానికి గూగుల్ సంస్థకు కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో విశాఖపట్నంకి గూగుల్ కంపెనీ రానుంది. ఇక్కడికి గూగుల్ కంపెనీ రావడం ద్వారా ఏకంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ విషయం వైజాగ్ వాసులకు, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తగా చెప్పవచ్చు. వైజాగ్ కు గూగుల్ వచ్చిన వెంటనే గేమ్ చేంజర్ లా మారుతుందని సీఎం అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేశారని, లోకేష్ వల్ల గూగుల్ ఒప్పందం జరిగినట్లు సీఎం ప్రత్యేకంగా లోకేష్ ను అభినందించారు.
Also Read: Pawan Kalyan: ఏపీ ఐఏఎస్ లకు పవన్ కళ్యాణ్ క్లాస్.. సీఎం చంద్రబాబు సైలెంట్.. ఎందుకలా!
లోకేష్ అమెరికా పర్యటన ఎఫెక్ట్ ఇప్పుడు రాష్ట్రంపై కనబడిందని, అందుకే పెట్టుబడుల హవా సాగుతుందని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొత్తం మీద ఏకంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా, గూగుల్ ఒప్పందం సాగడంపై నిరుద్యోగులు సైతం ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు.
విశాఖపట్నంకి గూగుల్ కంపెనీ వస్తుంది: చంద్రబాబు
ఈ రోజు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నాం
లోకేష్ కృషి వల్లే విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ
గూగుల్ విశాఖపట్నంకి వస్తే గేమ్ చేంజర్ అవుతుంది
గూగుల్‌తో ఒప్పందం ద్వారా 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నాం
– సీఎం చంద్రబాబు… pic.twitter.com/qoBqd0IaXR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2024