Manchu Family Issue.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబం (Manchu Family)లో గొడవలు బజారుకెక్కిన విషయం తెలిసిందే. మోహన్ బాబు పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఈ కుటుంబానికి చెందిన ఏ విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. అందులో భాగంగానే తాజాగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరగడంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇకపోతే గొడవ అనంతరం ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ (Manchu Manoj) 5:30 గంటలకి సాక్ష్యాలతో సహా బయటపెడతానని, ఆధారాలతో సహా వస్తానని తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే మరొకవైపు కాంటినెంటల్ హాస్పిటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంచు విష్ణు(Manchu Vishnu) ఐదున్నర గంటల వరకు డెడ్ లైన్ విధించారు. దీంతో ఎట్టకేలకు మనోజ్ దిగివచ్చినట్లు తెలుస్తోంది.
రాజీకి సిద్ధం అంటున్న మంచు మనోజ్..
మంచు మనోజ్ తాజాగా తన కుటుంబంతో రాజీకి రావడానికి సిద్ధమే అని తెలిపార. కుటుంబంతో కూర్చొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మనోజ్ తెలిపారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని తన తండ్రి మోహన్ బాబు స్కూల్ ని అక్కడ పెట్టారని తెలిపిన మనోజ్.. వినయ్ వైఖరి వల్లే తమ ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని , తమ అమ్మ ఆసుపత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తాను తన కుటుంబంతో రాజీపడడానికి సిద్ధమే అని చెప్పారు మంచు మనోజ్.
మా ఇంట్లో గొడవలకు వినయ్ ప్రధాన కారణం..
తమ ఇంట్లో గొడవలు జరగడానికి ప్రధాన కారణం వినయ్ అని మంచు మనోజ్ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు విద్యానికేతన్ సంస్థలలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. దీనికి తోడు మోహన్ బాబుకి ప్రధాన అధికారిగా కూడా పనిచేస్తున్నారు. వినయ్, తన అన్న మంచు విష్ణు ఇద్దరు కలిసి తన తండ్రి దగ్గర తనపై నెగెటివిటీ క్రియేట్ చేశారని మనోజ్ చెప్పుకొచ్చారు.
మంచు విష్ణు ప్రెస్ మీట్ తో మనోజ్ దిగి వచ్చారా..?
ఇకపోతే ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్లో మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో విష్ణు మాట్లాడుతూ.. మా కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా నేను ఇక్కడ చర్చించాలని అనుకోవట్లేదు. ఇక నా ఫ్యామిలీ గొడవలకు కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను కేవలం సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే డెడ్లైన్ విధిస్తున్నాను అంటూ అటు మౌనిక ఇటు మనోజ్ ఇద్దరికీ కూడా డెడ్లైన్ విధించారు. ఇకపోతే తల్లిదండ్రులను గౌరవించేవాడు అసలైన కొడుకు అని మనోజ్ పై ఇండైరెక్టుగా మంచు విష్ణు కామెంట్లు చేశారు. ప్రస్తుతం తాను తన భార్య, పిల్లలతో సపరేట్ గా ఉంటున్నానని, అటు మనోజ్, అక్క లక్ష్మి కూడా సపరేట్గా ఉంటున్నారని విష్ణు తెలిపారు. ఇకపోతే ఇప్పుడు నాన్నగారిని కాదని నాన్న మాటలు వినకుండా ప్రవర్తిస్తే పరిణామాలు ఇంకోలా ఉంటాయి అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు. మంచు విష్ణు. మంచు విష్ణు మాటలకు ఇప్పుడు మనోజ్ రాజీ పడడానికి సిద్ధమయ్యారు. మరి సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహిస్తారా ? లేదా? అనే విషయాలు వైరల్ గా మారాయి.