AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మృతి చెందితే అంత్యక్రియలకు అందించే నగదు ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో గల ఈ ఉత్తర్వులను మళ్లీ కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది.
అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు విద్యను అందించడం, తమ సెంటర్ పరిధిలోని గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించడం వంటి విధులను వీరు నిర్వహిస్తారు. ఇలా సేవలు అందించినందుకు వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. రాష్ట్రంలో పలు గ్రామాలలో మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడ నిర్వహిస్తున్నారు. అయితే గతంలో అంగన్వాడీలు కానీ, ఆయాలు కానీ సర్వీస్ లో ఉంటూ మరణిస్తే, వారి కుటుంబసభ్యులకు రూ. 15 వేలు నగదును అందజేసేవారు.
Also Read: Lady Aghori: కొమురవెల్లి ఆలయం వద్ద అఘోరీ హల్చల్.. ఏకంగా కత్తి పట్టుకొని బెదిరింపులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఉత్తర్వులను యదావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగుల శాఖ కార్యదర్శి సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో సర్వీస్ లో మృతి చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్దమైన వారసులకు రూ. 15 వేల నగదును అందజేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ఉద్యోగుల బకాయిలకు సంబంధించి నిధులు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.