BigTV English

AP Schools: ఈ నెల 7న స్కూల్ కి రండి.. కానీ అలా రావద్దు.. ఇలా చేయవద్దు

AP Schools: ఈ నెల 7న స్కూల్ కి రండి.. కానీ అలా రావద్దు.. ఇలా చేయవద్దు

AP Schools: ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన పెద్ద పండుగ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద పండుగ అంటే ఏదో జాతర అనుకోవద్దు సుమా. ఇదొక విద్యార్థుల భవిష్యత్ కి సంబంధించిన పండుగ. అయితే ఈ పండుగకు అందరూ ఆహ్వానితులే కానీ, ఇలా రావద్దు, అలా చేయవద్దు అంటోంది ప్రభుత్వం. ఇంతకు ప్రభుత్వం ఏమి చెప్పిందో ఓ సారి తెలుసుకుందాం.


రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పాఠశాలలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే విద్యార్థులకు అందించే భోజనం పూర్తి నాణ్యత కలిగి ఉండాలని ఆదేశించారు. ఇలా పాఠశాలల అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

తాజాగా అందులో భాగంగా పాఠశాలల అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం కావాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే ఈనెల 7వ తేదీన పెద్ద పండుగ పేరిట బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాపట్లలో జరిగే పెద్ద పండుగలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా అందరూ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, నాయకులు, దాతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.


ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, పాఠశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతేకాదు విద్యార్థుల్లో విద్యా సామర్థ్యం పెంచేందుకు ఏమి చేయాలి? చెడు వ్యసనాలకు లోను కాకుండా వారిలో ఎటువంటి చైతన్యం తీసుకురావాలన్నది కూడా కార్యక్రమం ఉద్దేశం. అంతేకాదు దాతలు కూడా స్వచ్చంధంగా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తే, ఆ నిధులు ఆ పాఠశాలకే ఉపయోగించాలని ప్రభుత్వ ఆలోచన.

Also Read: AP Mid Day Meal: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు కూడా ఆ పథకానికి అర్హులే

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే రాజకీయ పార్టీల నాయకులు మాత్రం, ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కండువాలను కప్పుకొని రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనే అవకాశం ఉందని, ఎవరు కూడా రాజకీయ ప్రసంగాలు కూడా చేయరాదని కూడా నిర్ణయించింది. పెద్ద పండుగలో కేవలం విద్యార్థులు, పాఠశాలలకు సంబంధించిన అంశాలపై మాట్లాడవచ్చని వివాదాస్పద కామెంట్స్ చేయరాదని కూడా కోరింది. మరి మీరు కూడా పెద్ద పండుగలో పాల్గొంటున్నారా.. అయితే ఇలా రావద్దు.. అలా మాట్లాడవద్దు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×