BigTV English

HC on BRS: పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులు.. న్యాయస్థానంలో విచారణ

HC on BRS: పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులు.. న్యాయస్థానంలో విచారణ

HC on BRS: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ కార్యాలయాలకు చౌకగా భూములు ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.


హైదరాబాద్‌తోపాటు మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు దక్కించుకున్నారని పిటిషనర్ ప్రస్తావించారు. 500 కోట్లు విలువైన భూమిని కేవలం 5 కోట్లుకు కేటాయించారని వాదించారు.

గజం 100 రూపాయలకే కేటాయింపు జరిగినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు, జర్నలిస్టులకు భూ కేటాయింపులపై గత నెల 25న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఈ సందర్భంగా ప్రస్తావించారు.


రెండేళ్లగా ఈ అంశంపై ప్రతివాది మాజీ సీఎం కేసీఆర్ కౌంటర్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×