E-Paper
Advertisement

ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు

ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు
Advertisement

Roja: టీడీపీ మహానాడు నిర్వహణపై మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నిర్వహించిన మహానాడును ఆమె ఒక ‘హైబ్రిడ్ మహానాడు’ గా అభివర్ణిస్తూ, ఇది ముమ్మాటికీ అట్టర్‌ఫ్లాప్ షో అని కొట్టిపారేశారు. బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఒకవైపు నాయకులు స్పీచ్‌లు దంచుతుంటే, మరోవైపు జనాన్ని ఆకట్టుకోవడానికి రికార్డింగ్ డాన్సులు పెట్టాల్సి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.

ఈ మహానాడు వేదికలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేర్ల కంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణే ఎక్కువగా వినిపించిందని రోజా విమర్శించారు. జగన్ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎలాంటి వణుకు పుడుతుందో దీనిని బట్టే అర్థమవుతోందని, అందుకే వారి ప్రసంగాలన్నీ జగన్ చుట్టూనే తిరిగాయని ఆమె మండిపడ్డారు.

Advertisement

టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటారని, మరి అలాంటప్పుడు డిజిటల్ స్క్రీన్ల ముందు జనం ఎందుకు లేరని రోజా ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ టీవీలు పెట్టి, కుర్చీలు వేసి చంద్రబాబు స్పీచ్‌లు వినిపించాలని చూసినా.. సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆ స్క్రీన్ల ముందు కూర్చోవడానికి ఆసక్తి చూపలేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మహానాడు ద్వారా టీడీపీకి ప్రజల్లోనే కాదు, సొంత క్యాడర్‌లోనూ ఆదరణ తగ్గిందనే విషయం మళ్లీ నిరూపితమైందని రోజా స్పష్టం చేశారు.

Related News

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×