BRS Mock Assembly: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన మాక్ అసెంబ్లీ ఆసక్తికరంగా సాగింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు.. అసలు సిసలైన అసెంబ్లీని తలపించేలా మాక్ అసెంబ్లీని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యమంత్రి పాత్రలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్‌గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు వ్యవహరించారు. సీఎం రోల్‌లో.. ఎమ్మెల్యే తలసాని తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం గానీ.. ఏ వంద రోజుల్లో అని చెప్పామా? అంటూ జోక్ వేశారు. అశోక్‌నగర్‌లో ఉద్యోగాలిస్తామని చెప్పింది తాను కాదని, వెళ్లి రాహుల్ గాంధీని అడగండి అంటూ చురకలంటించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇదే సభలో.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిలా వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేస్తే.. మాజీ సీఎం కేసీఆర్‌కు పేరొస్తుందనే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి వెలిగొండ ద్వారా ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా ప్రభుత్వానికి పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
జగదీశ్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ చేపట్టిన మాక్ అసెంబ్లీ.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Also Read: జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!