AI Misuse: ఏఐ అంటే సౌకర్యం.. పరిశోధన.. అభివృద్ధి. కానీ అదే ఏఐను దుర్వినియోగం చేస్తే ఎంత ప్రమాదకరమో ఆంత్రోపిక్ సంస్థ తాజాగా థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వార్నింగ్ ఇస్తోంది. ఎనిమిది నెలల్లో గుర్తించిన కేసుల్లో బయోలాజికల్ వెపన్స్‌కు ఉపయోగపడే పరిశోధనల కోసం ఏఐని వాడే ప్రయత్నాలు కనిపించాయ్. కొన్ని సందర్భాల్లో వైరస్‌లు, టాక్సిన్లపై సున్నితమైన రీసెర్చ్‌కు మోడల్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. మరోవైపు ఏఐ సహాయంతో మిసైల్ టెక్నాలజీ, డ్రోన్లు, సైనిక వ్యవస్థలపై పనిచేసిన కేసులూ బయటపడ్డాయ్. ఇక డేటింగ్ యాప్స్ వ్యవహారం మరింత షాకింగ్. కేవలం రెండు వారాల్లో 4,700కుపైగా AI లేడీ మోడల్స్… 25 వేల మంది నిజమైన యూజర్లతో చాట్ చేసినట్లు ఆంత్రోపిక్ ఐడెంటిఫై చేసింది. నిజానికి ఏఐ సృష్టించిన ఫేక్ ప్రొఫైల్స్ చూసి బోల్తా కొడుతున్నారు. అసలు భయం ఏంటంటే.. ఏఐకి కెపాసిటీ పెరగడం కాదు.. దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ల ఆలోచనలతో ప్రపంచమే సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.