E-Paper
Advertisement

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం
Advertisement

Survival Sci-Fi Thriller: ఒక స్పేస్ మిషన్‌ లో వెళ్లిన వ్యక్తి ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది ? అంతరిక్షంలో కూలిపోయిన స్పేస్‌ షిప్‌ నుంచి బయట పడితే… ఎదురుగా కనిపించేది మన భూమే. కానీ 65 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి భూమి అయితే ? చుట్టూ మనుషులు లేకుండా డైనోసార్లు మాత్రమే తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ? ప్రాణాలతో మిగిలిన ఓ చిన్నారితో కలిసి మిల్స్ అక్కడి నుంచి బయట పడగలడా ? అసలు వాళ్లు భూమికి తిరిగి వెళ్లేలోపు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నారు ? ఈ ఆసక్తికరమైన సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరే ’65’ మూవీ. మరి ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ భవిష్యత్తులో మొదలవుతుంది. సోమారిస్ అనే సుదూర గ్రహానికి చెందిన పైలట్ మిల్స్ తన కుటుంబం కోసం ఓ ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటాడు. అతని కూతురు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండటంతో, ఆమె చికిత్స కోసం భారీగా డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు సంపాదించేందుకు రెండేళ్ల సుదీర్ఘ అంతరిక్ష పరిశోధనా మిషన్‌ కు మిల్స్ అంగీకరిస్తాడు. అయితే ప్రయాణం సాఫీగా సాగదు. స్పేస్‌షిప్ భారీగా ఉన్న గ్రహశకలాల సమూహాన్ని ఢీకొని తీవ్రంగా దెబ్బతింటుంది. నియంత్రణ కోల్పోయిన నౌక ఓ తెలియని గ్రహంపై కూలిపోతుంది.

Advertisement

అది ఏదో పరాయి గ్రహం కాదు… ఏకంగా 65 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి భూమి. అప్పటికి మానవ నాగరికత అనేది లేదు. భూమిపై భయంకరమైన డైనోసార్లదే రాజ్యం. ప్రమాదంలో షిప్‌ లోని అందరూ ప్రాణాలు కోల్పోతారు. క్రయోజెనిక్ స్లీప్‌ లో ఉన్న కోవా అనే చిన్నారి మాత్రం బతికి బయట పడుతుంది. మిల్స్‌, కోవా భిన్నమైన గ్రహాలకు చెందినవారు కావడంతో వారి భాషలు కూడా వేరు. ఒకరి మాట మరొకరికి అర్థం కాదు. అయినా ఆ ప్రమాదకరమైన ప్రపంచంలో బతకాలంటే ఇద్దరూ కలిసి ముందుకు సాగాల్సిందే.

కూలిపోయిన షిప్‌ కు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఎస్కేప్ పాడ్ ఉందని మిల్స్ గుర్తిస్తాడు. అదే వారి రక్షణకు ఉన్న ఏకైక మార్గం. దీంతో డైనోసార్లు, వింత జీవులు, ప్రమాదకరమైన అడవుల మధ్య మిల్స్‌, కోవా తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. మార్గంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదం వారి ప్రాణాలకు డేంజరస్ గా మారుతుంది. ఇదే సమయంలో భూమిని ఢీకొట్టబోతున్న భారీ గ్రహశకలం కూడా వారి పరిస్థితిని మరింత ఉత్కంఠగా మారుస్తుంది. టి-రెక్స్‌ తో ప్రాణాంతకమైన పోరాటం తర్వాత మిల్స్‌, కోవా ఎస్కేప్ పాడ్‌ లోకి చేరతారు. మరి గ్రహశకలం భూమిని ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందు వారు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలిగారా ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడ ?

Advertisement

’65’ మూవీ ప్రస్తుతం సోనీలివ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో వీక్షించవచ్చు. డైనోసార్లు, సర్వైవల్ థ్రిల్, సైన్స్ ఫిక్షన్ అంశాలు ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి టైమ్‌పాస్‌గా ఉంటుంది. కాబట్టి ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Read Also: దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

Tags

Related News

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Big Stories

Advertisement
×