Big Stories

Heat Waves Alert : ఏపీలో ఠారెత్తిస్తోన్న ఎండలు.. నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

Heat Wave Alert in AP : ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటితే చాలు.. ఉక్కపోత మొదలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మరో 175 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు 67 మండలాల్లో తీవ్ర గాల్పులు, 213 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

- Advertisement -

ఇక ఐఎండీ సూచించిన దాని ప్రకారం.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రవడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రైతులు ఎండలు పెరగకముందే పొలం పనులు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -
Heat Wave Alert in AP
Heat Wave Alert in AP

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ.. ప్రపంచ దేశాలను భారీవర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, టాంజానియా, దుబాయ్ దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.

Also Read : వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

వరదలు, పిడుగుల కారణంగా.. పదులసంఖ్యలో ప్రజలు మృతి చెందారు. మరో మూడు నాలుగురోజుల పాటు ఆయా దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News