Big Stories

Drunk and Drive Cases: మత్తు వదలరా? మరణశాసనాన్ని లిఖిస్తున్న మందుబాబులు

Drunk and Drive Cases Latest News: మత్తు వదలరా? మరణశాసనాన్ని లిఖిస్తున్న మందుబాబులురూల్స్ ఉంటాయి. పట్టించుకోరు. పోని పక్కవాళ్లు చెప్పినా వినిపించుకోరు. కౌన్సిలింగ్‌లకు కరిగిపోయేది లేదు.. జరిమానాలకు బెదిరేది లేదు. పలానా రోడ్డులో పోలీసులు ఉన్నారంటే.. పక్క సందులో నుంచి వెళ్లడం తప్ప బాధ్యతగా ఉండాలన్న ఆలోచనైతే ఉండదు. పీకలదాక తాగడం.. రోడ్లపై పడటం.. జనాల ప్రాణాలు తీయడం.. ఇప్పుడు రోటీన్‌గా మారింది. ఇంతకీ మందుబాబుల ఆగడాలు ఇంకెన్నాళ్లు? ఈ దారుణాలను ఆపడం ఎలా? యాక్సిడెంట్ అంటే బైకో.. కారో రోడ్డు మీద పడటం కాదు.. ఓ కుటుంబం రోడ్డు మీద పడటం. యస్.. ఇది సినిమా డైలాగే.. కానీ హండ్రెడ్ పర్సెంట్ నిజం. కేబుల్‌ బ్రిడ్జ్ ఘటన కావొచ్చు. రాహీల్ ఇష్యూ కావొచ్చు.. ఐకియా వద్ద జరిగిన బీభత్సం కావొచ్చు.. రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అనేక యాక్సిడెంట్స్‌ కావొచ్చు. ఘటన ఏదైనా రీజన్‌ మాత్రం ఒకటే.. అదే మందు తాగి వెహికల్ నడపడం..

- Advertisement -

మాదాపుర్ కేబుల్ బ్రిడ్జి యాక్సిడెంట్‌ ఘటన లెటెస్ట్.. కేబుల్ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై ఫోటోలు తీసుకుంటున్నారు ఇద్దరు యువకులు. కారు వేగంగా రావడం.. వారిని ఢీకొట్టడం.. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందడం. అంతా క్షణాల్లో జరిగిపోయింది. మరి యాక్సిడెంట్‌కు రీజన్ ఏంటంటే.. కారు కంట్రోల్‌ చేయనంత వేగంగా రావడం మరి అంత వేగంగా ఎందుకు నడుపుతున్నారు? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్.. అతను తాగేసి ఉండటం.

- Advertisement -

ఇక రాయదుర్గంలోని ఐకియా సమీపంలో జరిగిన బీభత్సం మరోకటి. ఫుల్లుగా తాగేసి కారు నడపడమే కాకుండా… పలు వాహనాలను ఢీ కొట్టాడు మరో యువకుడు. చుట్టుపక్కల ఉన్నవారిపైకి కారును పోనిచ్చాడు. ఈ ఘటనలో ఓ 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఒకటి, రెండు, మూడు. ఇలా వందల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మందుబాబులు చేసిన దురాగతాలపై.. రాష్ట్రంలో, నగరంలో ఎక్కడో ఓ చోటా.. ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రమాదాలు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా.. ఓ కుటుంబమంతా కుంగిపోతోంది. పెద్దదిక్కుని కోల్పోతున్న వాళ్లు కొందరు. చిన్నారులను పోగొట్టుకుంటున్న వాళ్లు మరికొందరు. కొన్ని ఘటనల్లో మద్యం సేవించి వాహనం నడిపి.. అవతలి ప్రాణలు మాత్రమే కాదు.

Also Read: మోడీ గ్యారెంటీ.. అసలు మతలబేంటి?

వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. నిజానిక డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పంజాగుట్ట ప్రమాదం. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని, పిల్లల నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేసింది ఈ ఘటన. 2016లో తప్పతాగి కారు నడిపిన మైనర్ యువకులు డివైడర్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత వారి కారు వెళ్లి.. అపోజిట్‌గా వస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా. చిన్నారి రమ్య మాత్రం 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయింది. 18 రోజుల తర్వాత ఆ చిన్నారి తాతయ్య మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఓ కలకలాన్ని సృష్టించింది. మైనర్లకు మద్యం అమ్మడం.. తాగి డ్రైవ్ చేయడంపై ఓ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తర్వాతే డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌లు మరింత పెరిగాయి. కానీ ఇప్పటికీ అలానే తాగి నడుపుతున్నారు.. ప్రాణాలు తీస్తున్నారు.

మరి తాగి నడపడంపై చట్టం ఏం చెబుతుంది..? 1988 మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం మద్యం సేవించి వాహనాలు నడిపతే అనేక శిక్షలు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం బ్రీత్ అనలైజర్‌ రీడింగ్ 30 దాటితే దొరికిపోయినట్టే. నిజానికి బ్రీత్ అనలైజర్ టెస్ట్‌ను నిరాకరించేందుకు మనకు పూర్తి రైట్ ఉంది. కానీ ఇక్కడో తిరకాసు ఉంది.. అదేంటంటే.. పోలీసులకు మనం తాగి ఉన్నట్టు అనుమానమోస్తే బ్లడ్ టెస్ట్ చెయిస్తారు. ఒకవేళ ఇంకా అనుమానం ఎక్కువగా ఉంటే వితౌట్ వారెంట్ మనల్ని అరెస్ట్ చేసి హాస్పిటల్‌కు లేదా స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది ఈ చట్టం. ఇక రీడింగ్‌ 30-60 మధ్య ఉంటే ఆరు నెలల జైలు శిక్ష లేదా.. 2 వేలు ఫైన్.. 60-150 ఉంటే.. ఒక ఏడాది జైలు శిక్ష లేదా 4 వేల ఫైన్.. మూడేళ్లలోపు ఇదే కేసులో రెండుసార్లు దొరికితో.. మూడేళ్ల జైలు శిక్ష లేదా 8 వేల ఫైన్ విధించే అవకాశం ఉంది.. ఇక రీడింగ్‌ 150 దాటిందంటే.. రెండేళ్ల జైలు శిక్ష లేదా.. 5 వేల ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక పదే పదే తాగి నడుపుతూ దొరికి పోతే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేయడంతో పాటు.. జైలు శిక్షతో పాటు 10 వేల ఫైన్ విధించే అవకాశం ఉంది.

Also Read: కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు

నిజానికి సీసా చిన్నదైనా.. పెద్దదైనా దానిపై తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని. మరి మందుబాటుల కళ్లకు ఇది కనిపించడం లేదా? సరే.. మీ ఆరోగ్యం, మీ డబ్బు.. మీ ఇష్టం.. తాగండి.. డబ్బును తగలెయ్యండి. అది కూడా మీ ఇష్టం.. కానీ తప్పతాగక రోడ్ల మీదకు ఎందుకు వస్తున్నారు? అమాయకుల ప్రాణాలను ఎందుకు బలి తీసుకుంటున్నారు? ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతే ఈ పరిస్థితి మారుతుంది?మీలో ఎప్పుడు మార్పు వస్తుంది? అనేదే మెయిన్ క్వశ్చన్.. 2023లో ఏకంగా ఒక లక్షా 6 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

5వేల 32 మందిని జైలుకు పంపారు. ఒక్క డిసెంబర్ 31 నైటే.. దాదాపు 3 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే.. బైక్ నడిపే వారిలో ఎంత చైతన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అధికారుల చర్యలు కూడా తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం.. వార్నింగ్‌లు ఇవ్వడం.. ఆ తర్వాత మర్చిపోవడం. ఇదే జరుగుతుంది. ప్రతి వీకెండ్‌లో పబ్‌లలో తప్ప తాగి బయటికి వచ్చే వారు అనేకం.. వాళ్లే కార్లు నడుపుకుంటూ వెళ్లి ప్రజల ప్రాణాలు తీసే సంఖ్య కూడా ఎక్కువే.. మరి అక్కడే వారిని అడ్డుకుంటే.. ప్రజల ప్రాణాలు కాపాడినవారవుతారు కదా..? మరి అలాంటిది ఏమైనా జరుగుతుందా? లేదు.

నిజానికి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతున్న వాళ్లలో.. చాలా మంది సొసైటీలో చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్లు ఉంటున్నారు. హైయర్ స్టడీస్ చదవిన వారు ఉంటున్నారు. వీళ్లకు చట్టాల గురించి తెలుసు.. తాగి వాహనం నడపవద్దని తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యం.. తాగితే బాడీ, మైండ్ కంట్రోల్‌లో ఉండదు. వెహికల్‌ ఎటు పోతుందో అర్థం కాదు. స్పీడ్‌ని కంట్రోల్ చేయలేరు. ఏదైనా జరిగితే కార్లో ఉన్న వారితో పాటు రోడ్డు మీద పోతున్న వాళ్లకు కూడా ప్రమాదమే.. అన్నీ తెలిసినా  ఇవే సీన్లు రీపిట్ అవుతున్నాయి..
మీ ఆనందం కోసం మీరు తాగండి.. కానీ తాగాక కారు మీరు నడపవద్దు. డ్రైవర్లను పెట్టుకోండి. ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా అవగాహన కల్పించినా తాగుబోతుల తీరు మారడం లేదు. ఇకనైనా మారండి.. మీరు సేఫ్‌గా ఇంటికి వెళ్లండి. అందరిని వెళ్లనివ్వండి. మీలో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చెకింగ్‌లు పెట్టినా.. ఫలితం శూన్యం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News