Big Stories

Dune Part 2 OTT: రూ.1500 కోట్ల బడ్జెట్‌ సినిమా.. ఆ రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది

Dune Part 2 OTT: ప్రస్తుతం సినీ ప్రియులంతా ఓటీటీల పైనే పడ్డారు. ఎంచక్కా ఇంట్లో కూర్చుని కొత్త కొత్త సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా మరో బ్లాక్ బస్టర్‌ హిట్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘డ్యూన్ పార్ట్ 2’. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఏ ఓటీటీలో రిలీజ్ అయిందో తెలుసుకుందాం.

- Advertisement -

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు విల్లేనెయువ్ డైరెక్షన్‌లో 2021లో ‘డ్యూన్ పార్ట్ వన్’ తెరకెక్కింది. అప్పట్లో ఈ మూవీ సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఆరు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ డిజైనింగ్‌తో సహా మరో మూడు విభాగాల్లో ఈ మూవీ అవార్డులను కైవసం చేసుకుంది.

- Advertisement -

అంతేకాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా ఈ చిత్రం అనేక అవార్డులను కొళ్లగొట్టింది. దీంతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెన్సేషనల్ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌ను మేకర్స్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు. ఇక సెకండ్ పార్ట్‌ కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Also Read: ‘మంగళవారం’ డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత

టిమోథీ ఛాల్‌మెట్, రెబెకా ఫెర్యూసన్, అస్టీన్ బట్లర్ జెండాయా వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషించి అదరగొట్టేశారు. ఈ ఏడాది మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఈ సెకండ్ పార్ట్ దాదాపు రూ.1500 కోట్లతో తెరకెక్కింది. బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.4,500 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఔరా అనిపించింది. దీంతో 2024లో హాలీవుడ్‌ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలలో ఒకటిగా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్, బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఈ మూవీ రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీ ఫస్ట్, సెకండ్ పార్ట్‌లు సంచలన విజయాలు అందుకోగా ఇప్పుడు మూడో పార్ట్‌ను కూడా మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News