TDP vs YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచిపోయింది. అయినా దిగువ స్థాయిలో కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువు ప్రాంతంలో గురువారం మండల సమావేశానికి ముందు కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మండల కార్యాలయంలో భేటీ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో సమావేశం నిర్వహించకూడదంటూ కూటమి నేతలు నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.
చివరకు ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల నేతలు మండల కార్యాలయానికి రాగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో అల్లర్లుకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
పోలీసులు దగ్గరుండి మండల ప్రజాప్రతినిధులను లోపలకు పంపారు. గత ఐదు సంవత్సరాలుగా ఏనాడు సమావేశంలో జరపలేదని, ఇప్పుడు వైసీపీ నేతలు సర్వసభ్య సమావేశం పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ నేతలు. పోలీసులు జోక్యంతో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తున్నాయి.
ALSO READ: జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కాలిపోయినయ్.. కావాలనే చేశారా..?
మరోవైపు ములకల చెరువు మండలం సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు వైకాపా ఎంపీటీసీలు ,జడ్పిటీసీలు. సమావేశం మినిట్స్ బుక్కున లాక్కున్నారు వైకాపా ఎంపీటీసీలు. సమావేశం నిర్వహించు కుండా ఇన్నాళ్లు ఏం చేశారంటూ ఎంపీడీవోను అసభ్య పదజాలంతో దూషించారట. అధికారులు సంతకాలు పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. చివరకు ఎంపీడీవో చాంబర్లు ఎంపీడీవోని చుట్టుముట్టారు వైకాపా ఎంపీటీసీలు.