Fire Accident: జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అనంతపురం నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన రెండు బస్సులు దగ్ధమయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున అనంతంపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై 11 KV వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. దీంతో చుట్టు పక్కల దట్టమైన పొగలు వ్యాపించాయి.
పరిసర ప్రాంతాల్లో భారీగా పొగలు వ్యాపించడంతో స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. అదృష్టవశాత్తూ బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా.. ఎవరైనా కావాలనే చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో.. ప్రత్యర్థులు ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడక పోవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ బస్సులు 5 సంవత్సరాల నుంచి వాడకంలో లేకపోవడంతో జేసి దివాకర్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదని తెలుస్తోంది. పోలీసులు విచారణ జరిపిన అనంతంర ప్రమాదానికి సంబంధించి నిజానిజాలు తెలియనున్నాయి.