BigTV English

High Tension in Gudivada: మాజీమంత్రి పేర్నినాని కారుపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

High Tension in Gudivada: మాజీమంత్రి పేర్నినాని కారుపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

High Tension in Gudivada: ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీమంత్రి పేర్నేనాని కారుపై జనసేన పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన క్రమంలో పేర్ని నాని కారుపై దాడి చేశారు. అక్కడికి జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని పేర్నినానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేర్ని నాని వెంటనే పవన్ కల్యాణ్ కు క్షణాపలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాళ్లతో దాడి చేయడంతో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో గుడివాడలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.


Also Read: భారీ వర్షాలు.. మరో వయనాడ్ గా విజయవాడ

ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయన్నారు. తమ పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అటవిక పాలనకు ఈ ఘటనలే నిదర్శనమని బొత్స మండిపడ్డారు.


ఏపీలో ప్రస్తుతం అటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందన్నారు. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండుసార్లు దాడులు జరిగాయని బొత్స అన్నారు. స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వెళ్లిని పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్నారు. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. ఈ విధంగా దాడులకు పాల్పడడం సరికాదన్నారు బొత్స.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×