BigTV English

Holiday: బ్రేకింగ్ న్యూస్.. రేపు ఏపీలో విద్యాసంస్థలకు సెలవు!

Holiday: బ్రేకింగ్ న్యూస్..  రేపు ఏపీలో విద్యాసంస్థలకు సెలవు!
Advertisement

Holiday to all educational institutions: ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు దినంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.


Also Read: భారీ వర్షాలు.. మరో వయనాడ్ గా విజయవాడ

ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు భారీగా పొంగిపొర్లుతున్నాయి. వాటర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి నిండుకుండలా మారిపోయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు వరదల్లో చిక్కి మృత్యువాతపడ్డారు. కొండచరియలు విరిగి మీదపడి మరికొంతమంది దుర్మరమం చెందారు. ముగ్గురు వాగులో కారుకొట్టుకుపోయి మృతిచెందారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు వరదల కారణంగా నిరాశ్రాయులయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే వరద ముంపుతో బాధపడుతున్న ప్రజలను ఆ క్యాంపులకు తరలించింది. పలు ప్రాంతాలకు బోట్లను సైతం పంపింది ప్రభుత్వం. మరికొన్ని వరద ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంటున్నది.


భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి ప్రాజెక్టులు నిండుతున్నాయి. దీంతో అవి పూర్తిగా నిండుకుండలా మారాయి. అటువైపు కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. దిగువ ప్రాంతాలకు నీటి వదలాలని సూచిస్తునన్నది.

ఇదిలా ఉంటే.. విజయవాడ, గుంటూరులో ఇదివరకు ఎప్పుడూ లేనంతగా భారీగా వర్షం కురుస్తున్నది. గడిచిన 24 గంటల్లో 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీగా వర్షం కురుస్తుండడంతో విజయవాడ, గుంటూరులోని చాలా ప్రాంతాలను పూర్తిగా వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో ఆ జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తిరుమల కొండపై.. ఇవేం పనులు రోజా?

విజయవాడ దుర్గమ్మ సన్నిధానంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. బెజవాడ బస్టాండ్, రింగ్ రోడ్డు, బెంజ్ సర్కిల్, దుర్గగుడి ఫ్లైఓవర్.. ఇలా దాదాపు బెజవాడలో ఉన్న అన్ని సెంటర్లు ప్రస్తుతం వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. రోడ్లపై కూడా మోకాళ్ల లోతు వరకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వరద ముందు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు.

Related News

Pithapuram Politics: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Big Stories

×