EPAPER

CPI Narayana: పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

CPI Narayana: పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

CPI Narayana: అసలే తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే వివాదం చిలికిచిలికి గాలి వానగా మారి దుమారం రేగుతుంటే.. సిపిఐ నారాయణ స్పందించి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వివాదంపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేయగా.. కోర్టులో విచారణ సాగుతోంది. ఈ సంధర్భంగానే సీపీఐ నారాయణ కామెంట్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


తనపై వచ్చిన ట్రోలింగ్స్ పట్ల మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. అలాగే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని కూడా ఈ సంధర్భంగా లేవనెత్తారు. దీనితో కేటీఆర్ వైపుకు పెట్టిన గురి.. అక్కినేని ఫ్యామిలీకి తాకింది. అలాగే సమంతా పేరును కూడా కొండా సురేఖ తెరపైకి తీసుకురాగా.. సినీ ఇండ్రస్ట్రీ మొత్తం వారికి అండగా నిలబడింది . సమంతా కూడా రాజకీయాల్లోకి తమ వ్యక్తిగత విషయాలు లాగవద్దు అంటూ ప్రకటన విడుదల చేశారు. దీనితో మంత్రి కొండా సురేఖ సారీ చెప్పి.. తన మాటలను వెనక్కు తీసుకున్నారు. అంతేకాకుండా నేరుగా పీసీసీ అద్యక్షుడు మహేష్ గౌడ్ కూడా.. ఈ విషయానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతూ.. సారీ చెప్పారు.

ఇక నాగార్జున మాత్రం తన పరువుకు భంగం కలిగిందంటూ.. నాంపల్లి కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఈ కేసుకు సంబంధించి నాగార్జున వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అంతేకాకుండా న్యాయమూర్తి సమక్షంలో సాక్షుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి.. 23వతేదీకి వాయిదా వేశారు. అయితే నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై ఇప్పటికే మంత్రి సురేఖకు కోర్టు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇది ఇలా ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ కూడా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ.. కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా మంత్రి చేసిన కామెంట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.


ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సీపీఐ నారాయణ స్పందించారు. మొదట నుండి నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ కు వ్యతిరేకంగా నారాయణ కామెంట్స్ చేసేవారు. పలుమార్లు బిగ్ బాస్ షో గురించి నారాయణ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారంటూ గతంలో ప్రశ్నించారు. ఇప్పుడు అదే బిగ్ బాస్ షోను దృష్టిలో ఉంచుకొని నారాయణ సంచలన కామెంట్స్ చేశారు.

Also Read: Jani Master: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు

నారాయణ చేసిన వ్యాఖ్యల ఆధారంగా.. పరువు లేని వారు.. పరువు నష్టం దావా వేస్తారా అంటూ.. బిగ్ బాస్ షో తో పరువు పోగొట్టుకున్న నాగార్జున, మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఏమిటన్నారు. ఏదైనా సమ్మతమైన దావా వేయాలి కానీ.. బిగ్ బాస్ ద్వారా అన్ పాపులర్ అయిన వ్యక్తి.. పరువు నష్టం దావా వేయడం అవమానకరమన్నారు. మంత్రి సురేఖ సారీ చెప్పారని, అయినా కూడా ఆ షో ద్వారా అన్ పాపులర్ అయిన వ్యక్తి.. పరువు నష్టం దావా వేయడం జోక్ గా ఉందన్నారు.

ఇలా నారాయణ ఓ వీడియో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ చేసిన కామెంట్స్.. ఏ వివాదానికి దారితీస్తాయో వేచి చూడాలి.

Related News

Lady Aghori : ఆత్మార్పణ అంటూ మూడు రోజులుగా హల్ చల్.. చివరికి ఏమైందంటే.?

PCC Chief Mahesh Goud : అందరికీ అభివృద్ధి.. ఇదే రాహుల్ లక్ష్యం – పీసీసీ చీఫ్ మహేశ్

Telangana University : యూనివర్సిటీల ప్రక్షాళనకు సీఎం రేవంత్ సన్నాహాలు

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లకో యాప్

New Metro Line : మెట్రో రెండో దశ పనుల్లో కీలక పురోగతి.. ఈ మార్గాల్లో పనులు ప్రారంభం

Asiruddin Owaisi : నా టార్గెట్ బీఆర్ఎస్.. త్వరలోనే అన్నీ బయటపెడతా – అసరుద్దీన్

MP Dharmapuri : కులగణన సర్వేకు బీజేపీ మద్ధతు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర కామెంట్స్

Big Stories

×