Minister Anitha: తీరిక లేని పనుల్లో బిజీగా ఉన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. కాస్త రిలాక్స్ కోసం ఫేమస్ టీ స్టాల్‌ను సందర్శించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. టీ తయారీ చేయడాన్ని పరిశీలించిన ఆమె స్వయంగా తయారు చేశారు. అనంతరం రుచి చూసి ‘ఆహా.. ఏమి రుచి’ అంటూ నిర్వాహకులతో ముచ్చటించారు.
హోం మంత్రి అనిత ఆదివారం రాత్రి ఎంవీపీ కాలనీలో సందడి చేశారు. ఎంవీపీ కాలనీలో ఫేమస్ ‘వైజాగ్ దమ్ టీ స్టాల్’ని విజిట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. కంచుపాత్రలోని చిన్న కుండలో ప్రత్యేకంగా టీ తయారీ చేయడాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆమె స్వయంగా టీని తయారు చేశారు.
అనంతరం రుచి చూసి ఆహా ఏమి రుచి అంటూ నిర్వాహకులతో ముచ్చటించారు . దాదాపు అరగంట సేపు ఎంవీపీ కాలనీలోని టీ స్టాల్ వద్ద మంత్రి గడిపారు. అనుకోని అతిథిలా వచ్చిన హోంమంత్రికి నిర్వాహకులు థాంక్స్ చెప్పారు.
స్థానికులతో వివిధ అంశాలపై హోం మంత్రి అనిత ముచ్చటించారు. రోడ్లు ఎలా ఉన్నాయంటూ స్థానికుల నుంచి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమ సమస్యలు చెప్పినట్టు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లుగా ఇలాంటి సన్నివేశాలను తాము చూడలేదని, స్వయంగా మంత్రి రావడం ఆనందంగా ఉందని అంటున్నారు.
Minister Anitha visit Tea Stall (Credit TDP Twitter)