Woman Constable Murder: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన వెనుక కులాంతర వివాహమే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురైంది. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగమణి హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల కిందట ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.
సోమవారం ఉదయం విధులు నిర్వర్తించేందుకు హయత్‌నగర్‌కు బయలుదేరింది నాగమణి. ఆమె స్వగ్రామం రాయపోలు సమీపంలో ఈ హత్య జరిగింది. నాగమణి వాహనాన్ని కారుతో ఢీ కొట్టిన దుండగులు ఆపై కత్తితో దాడి చేశారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ నాగమణి.
2020 బ్యాచ్‌కు చెందిన నాగమణి, రీసెంట్‌గా సొంత గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత హయత్‌నగర్‌లో నాగమణి దంపతులు ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో సొంతూరు వెళ్లింది.
ALSO READ: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. వాజేడు ఎస్సై ఆత్మహత్య..అసలేం జరిగింది..
సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య వెనుక కుటుంబ సభ్యులు ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నాగమణి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఆస్తి కోసమే అక్కను తమ్ముడు పరమేష్ చంపినట్టు తెలుస్తోంది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్ని తానై నడిపించాడు సోదరుడు. నాగమణికి ఇది వరకే వివాహం జరిగింది.. ఆపై విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత తమ్ముడికి ఇచ్చింది నాగమణి. రెండో భర్త శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకున్న తర్వాత తమ్ముడుకి ఇచ్చిన భూమిలో తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో నాగమణి తమ్ముడు పరమేష్ హత్యకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుడు పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నాగమణి ప్రేమ వ్యవహారానికి వద్దాం. ఎనిమిది సంవత్సరాలుగా తనకు-నాగమణికి మధ్య ప్రేమ ఉందన్నది ఆమె భర్త శ్రీకాంత్ వెర్షన్.
మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారట. 2020లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు నాలుగేళ్లు హాస్టల్‌లో ఉందట. ఆ సమయంలో ఆమెకు కావలసిన అవసరాలు తీర్చి చదివించానని అంటున్నాడు.
కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత సోదరుడు దగ్గరయ్యాడు. నవంబర్ 10న యాదగిరిగుట్టలో తాము పెళ్లి చేసుకున్నామని, ఆ వెంటనే తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నాడు.
పెళ్లి చేసుకున్నప్పటి నుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యుల బెదిరిస్తూ వచ్చారని, అనుకున్నట్టేగానే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడని కన్నీరు మున్నీరు అయ్యాడు. రాయపోలు నుండి హయత్ నగర్ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసిందని, మా తమ్ముడు తనను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేసిందని వివరించాడు. వెంటనే మా అన్నయ్యకు ఈ విషయం చెప్పానని, ఆయన వెళ్లే లోపే రక్తపు మడుగులో నాగమణి పడిపోయి ఉందన్నాడు శ్రీకాంత్.