BigTV English

Guinea Football Bloodbath: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రక్తపాతం.. 100 మంది మృతి!.. కారణాలివే..

Guinea Football Bloodbath: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రక్తపాతం.. 100 మంది మృతి!.. కారణాలివే..

Guinea Football Bloodbath| వినోదం కోసం ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి వెళితే.. అక్కడ విషాదం జరిగింది. ఫుట్ బాల్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండగా 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమాఫ్రియా ఖండంలోని గినియా కొనాక్రిీ దేశంలో జరిగింది. గినియా దేశం ఎన్‌జెర్కోర్ నగరంలో ఆదివారం డిసెంబర్ 2, 2024న ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా రెండు శత్రు వర్గాలు తలపడ్డాయి. ఈ ఘర్షణలో దాదాపు 100 మంది చనిపోయారని ఫ్రాన్స్ మీడియా సంస్థ ఎఎఫ్‌పి తెలిపింది.


వివరాల్లోకి వెళితే.. ఎన్‌జెర్కోర్ నగరంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెఫరీ నిర్ణయం పట్ల కోపంతో కొందరు తమ అభిమాన జట్టుకు అన్యాయం జరిగిందని ప్రేక్షకుల ప్రాంతం నుంచి గ్రౌండ్ పిచ్ వరకు దూసుకెల్లారు. ఆ తరువాత మరో వర్గం కూడా వారిని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చూస్తూ ఉండగానే ఫుట్ బాల్ గ్రౌండ్ రక్తసిక్తమైంది.

Also Read:  సిరియాలో రెబెల్స్ జోరు.. ప్రభుత్వం కూలిపోతుందా?..


వినోదం కోసం జరగాల్సిన మ్యాచ్‌లో పంతాలు పట్టింపులతో ఒకరినొకరు చంపుకున్నారు. క్రీడా క్షేత్రం కాస్త యుద్ధక్షేత్రంగా మారింది. మ్యాచ్ అర్దాంతరంగా ముగిసిన తరువాత సోషల్ మీడియాలో కొందరు అక్కడ జరిగిన ఘటనల వీడియోలను పోస్ట్ చేశారు. ఒక వీడియోలో రెండు టీమ్‌ల అభిమానులు హింసాత్మకంగా తలపడడం కనిపిస్తోంది.

మ్యాచ్ తరువాత కూడా హింస కొనసాగింది. మీడియా కథనాల ప్రకారం.. అల్లరి మూకలు ఎన్‌జెర్కోర్ నగర పోలీస్ స్టేషన్ తగలబెట్టేశారు. సమీపంలోని స్థానిక ఆస్పత్రులు శవాలతో కిక్కిరిసిపోయాయి. ఒక స్థానిక ఆస్పత్రిలో పనిచేసే ఒక డాక్టర్ మాట్లాడుతూ.. “ఆస్పత్రిలో శవాల గది నిండిపోయింది. దీంతో ఆస్పత్రి హాల్ వే లోనే కనుచూపు మేర వరకు శవాలు తీసుకొని వచ్చి పడేశారు. నాకు ఎక్కువ మాట్లాడేందకు అనుమతి లేదు. దాదాపు 100 మంది చనిపోయారు. ఈ సంఖ్య ఎక్కువే ఉండొచ్చు.” అని తెలిపాడు.

సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో అల్లరి మూకలు నగరంలో హింసాత్మకంగా దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఫుట్‌బాల్ మ్యాచ్ లు గినియా దేశంలో సహజంగా జరుగుతుంటాయి. అయితే ఒక మ్యాచ్ లో ఈ స్థాయిలో హింస జరగడం ఇదే తొలిసారి. తాజాగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ గినియా దేశ అధ్యక్షుడు, జుంటా తెగ నాయకుడు మమాడి డుంబోయా పేరున నిర్వహించే టోర్నమెంట్ లో భాగంగా జరిగింది. మమాడీ డుంబోయా 2021లో మిలిటరీ తిరుగుబాటు చేసి గినియాలో ప్రభుత్వాన్ని కూలదోశాడు. ఆ తరువాత క్రమంగా అధికారం చేజిక్కించుకొని తనకు తానే దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.

2025లో గినియా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే తన సత్తా చాటడానికి ప్రజలను డుంబోయా భయం గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు.

గినియా దేశంలో 2021లో అధ్యక్షుడు ఆల్ఫా కొండే తన మిలిటరీ జెనెరల్ గా డంబోయాని నియమించారు. మిలిటరీ తిరుగుబాటు జరగకకూడదనే అతడిని ఎలైట్ ఫోర్స్ బాధ్యతలు కూడా అప్పగించాడు. కానీ డుంబోయా ప్రెసిడెంట్ ఆల్ఫ కొండేని మోసం ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. అప్పటి నుంచి అధికారం చేజిక్కించుకొని రాజ్యమేలుతున్నాడు.

అయితే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి ఒత్తిడి చేయడంలో 2024 లో ఎన్నికలు నిర్వహించి దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి డంబోయా అంగీకరించాడు. కానీ 2024 సెప్టెంబర్‌లో తాను ఎన్నికలకు వ్యతిరేకమని ప్రకటించాడు. దీంతో అతనిపై ఐరాస మిలిటరి చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది. ఈ కారణంగా మరి కొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయని డుంబోయా ప్రభుత్వం ప్రకటించింది. కానీ పేరుకే ఎన్నికలు ప్రజలు తననే ఎన్నుకోవాలని డుంబోయా ప్రజలను భయం చూపించి తన గుప్పిట్లో పెట్టకుంటున్నాడు.

గినియా దేశంలాగే ఆఫ్రికా మిగతా దేశాలైన నైజర్, మాలీ, బుర్కీనా ఫాసోలో కూడా ఉంది. అక్కడ కూడా ఇలాగే మిలిటరీ తిరుగుబాటుతో నియంత ప్రభుత్వాలు నడుస్తున్నాయి.

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×