E-Paper
Advertisement

సింగర్ అంకిత్ దారుణ హత్య.. జిమ్ నుంచి బయటకు వస్తుండగా, కాల్చి చంపిన ప్రత్యర్థులు, యూపీలో ఘటన

సింగర్ అంకిత్ దారుణ హత్య.. జిమ్ నుంచి బయటకు వస్తుండగా, కాల్చి చంపిన ప్రత్యర్థులు, యూపీలో ఘటన
Advertisement

Singer Murdered: గాయకుడు అంకిత్ దారుణహత్యకు గురయ్యాడు. జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్లపాటు సింగర్‌పై కాల్పులు జరిపారు. దీంతో స్పాట్‌లో సింగర్ మృతి చెందాడు. ఇంతకీ సింగర్‌కు నేపథ్యం ఏంటి? హత్య చేయడానికి కారణాలేంటి?

 

యూపీలోని షామ్లీలో దారుణం, సింగర్ అంకిత్ హత్య

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో దారుణం జరిగింది. హర్యానా గాయకుడు అంకిత్ బలియాన్‌ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. బుధవారం సాయంత్రం ఆయన జిమ్ నుండి బయటకు వస్తుండగా 20 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు దుండగులు. దీంతో అంకిత్ తల, కడుపు భాగంలో ఐదు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆయన మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

జిమ్ నుంచి బయటకు వస్తుండగా కాల్చి చంపిన దుండగులు

Advertisement

హర్యానా సంగీత పరిశ్రమలో విషాదకరమైన ఘటన. భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్ అనే హిట్ సాంగ్‌తో ఫేమస్ అయ్యాడు. ఓ వైపు సింగర్‌గా రాణిస్తూ.. మరోవైపు నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు అంకిత్ బలియాన్. యూపీలోని షామ్లీలో బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ దుండగులు నడుస్తూ తుపాకులు పట్టుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపారు. అంకిత్ స్వస్థలం షామ్లీ జిల్లాలోని బంతిఖేడా గ్రామానికి చెందినవాడు. కొన్ని సంవత్సరాలుగా సింగర్‌గా కాకుండా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం హర్యానాలోని రోహ్‌తక్- సోనిపత్‌ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాడు.

 

20 రౌండ్లు కాల్పులు, అక్కడిని నిందితులు పరార్

గడిచిన ఏడాదిగా అంకిత్ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తున్నాడు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. హత్య వెనుక పాత కక్షలు లేదా ముఠా పోరాటాలు కారణమని భావిస్తున్నారు.

ఘటన గురించి తెలియగానే అంకిత్ కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు.  మృతదేహాన్ని షామ్లీ కూడలిలో ఉంచి నిరసనకు దిగారు. హంతకులను అరెస్టు చేసే వరకు రోడ్డుపై ఉంటామని తెగేసి చెప్పారు. ఈలోగా పోలీసులు అధికారులు వచ్చి వారికి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు.  అంకిత్ జిల్లా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల వెనుక అతని రాజకీయ నిర్ణయం కారణమా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జాబ్స్.. కనీసం జీతం రూ.1 లక్ష

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×