E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందు పెళ్లి చేసుకోలేదని నిరూపించేందుకు ఐషు ప్లాన్      

Brahmamudi Serial Today Episode August 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందు పెళ్లి చేసుకోలేదని నిరూపించేందుకు ఐషు ప్లాన్      
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటికి వెళ్లిన రాజు లక్ష్మీ చేతి వంట తింటూ అద్బుతంగా ఉందని ఎంత ఖరీదైన వంటల్లో కూడా లేని టేస్ట్‌ నీ చేతి వంటలో ఉందమ్మా అంటూ మెచ్చుకుంటుంటాడు. అప్పుడే చలపతి వచ్చి అంటే మీ అమ్మ చేతి వంట తినడానికే వచ్చావా..? అంటూ అడగ్గానే.. అదేం లేదు.. మిమ్మల్ని చూడాలి కదా అంటాడు. తర్వాత చలపతి.. రాజుకు వెంకీ గురించి వెంకీ కోచింగ్‌ గురించి చెప్పి యాభై వేలు కడితే వాడు జాయిన్‌ అవుతాడు. అని చెప్పగానే.. రాజు కంగారుపడతాడు. ఎలాగోలా యాభై వేలు సర్దుతానని చెప్తాడు. చలపతి ఎమోషనల్‌ అవుతాడు. ఒకప్పుడు ఎవడు డబ్బులు ఇస్తాడా..? ఫ్రీగా నొక్కేద్దామా అని చూసేవాడివి ఇప్పుడు అప్పు తీసుకుందామంటేనే వద్దంటున్నావు అంటూ ఆశ్చర్యపోతాడు.

తర్వాత రాజు, వెంకీ దగ్గరకు  వెళ్లి జాబ్‌ రాలేదని ఫీల్‌ అవుతున్నావా..? నువ్వు మరీ ఇంత సెన్సిటివ్‌ ఏంట్రా ఏదో మనం ప్రేమించిన అమ్మాయి దూరం అయినట్టు ఎందుకు ఫీల్‌ అవుతావు.. ఇది కాకపోతే వంద జాబులు ఉంటాయి.. అయినా నేను నిన్ను చూసిన ప్రతిసారి ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నావు.. నీ మనసులో జాబ్‌ విషయం కాకుండా ఏదో ఇంకో విషయం ఉందా..? అని అడిగితే.. వెంకీ కంగారుపడుతూ అదేం లేదు అన్నయ్య జాబ్‌ గురించే.. అని చెప్పినా.. రాజు అరేయ్‌ మనిద్దరం కలిసే పెరిగాము.. నేను నీ అన్నయ్యనురా మనిద్దరం కలిసే పెరిగాం.. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా.. నువ్వు ఇక్కడ ఉంటావురా.. నీకు ఏమైనా నేను ఉంటాను.. ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చి వెళ్లిపోతాడు.

Advertisement

ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయాలని ఫోన్‌లో ఆడియో ప్లే చేస్తుంటాడు శేషు. అది విన్నా కూడా భ్రమరాంబ పట్టించుకోదు.. దీంతో శేషు ఎందుకు పట్టించుకోవడం లేదు.. అంటూ రిపీట్‌ ప్లే చేస్తుంటాడు. ఎందుకు ఊరికే అదే వినిపిస్తున్నావు.. అంటూ తిడుతుంది. అన్ని సార్లు విన్నా నీకు అర్థం కాలేదంటే.. నీకు తలలో ఏమీ లేదని అర్థం అవుతుంది అంటూ తిడతాడు. అపర్ణ అడ్డుగా వచ్చి భ్రమరాంబ నువ్వు వరలక్ష్మీ వ్రతం చేయాలని అందుకే వినిపిస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడే రేఖ, ఐశ్వర్య వస్తారు. శేషును తిడతారు.. అపర్ణ మాత్రం రేపు తాను ఎలాగూ వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాను నాతో పాటు మీరు చేయండి అని చెప్పగానే.. రేఖ, భ్రమరాంబ కూడా వ్రతం చేయడానికి రెడీ అవుతారు. వ్రతం పేరుతో ఇందును అందరి ముందు ఇరికించాలని ఐశ్వర్య ప్లాన్‌ చేస్తుంది. ఇందును కూడా రాజుతో కలిసి వ్రతం చేయమని చెప్తుంది. అపర్ణ ఏదో చేసి వాళ్లిద్దరితో వ్రతం చేయకుండా ఆపేయాలని ప్లాన్ చేస్తుంది. అయినా ఐషు వినకుండా బలవంతంగా ఇందును ఒప్పుకునేలా చేస్తుంది.

తర్వాత అపర్ణ కిచెన్‌లోకి వెళ్లి పెళ్లి కాకుండానే పెళ్లి అయనట్టు అమ్మవారి ముందు కూర్చుని వ్రతం చేయడం ఎంత అపచారమో తెలుసా..? వద్దు ఇందు నేను వాళ్లకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్‌ చేస్తాను. అమ్మవారితో ఆటలాడితే మనకే నష్టం జరుగుతుంది. అందుకే రేపు నువ్వు వ్రతం చేయకూడదు అని చెప్పగానే.. వ్రతం చేయకపోతే ఐషు మాకు పెళ్లి జరగలేదని ఆ రేఖ ఆంటీకి ప్రూవ్‌ చేస్తుంది అంటూ చెప్తూ.. ఉండగానే.. రాజు వస్తాడు. ఏంటి అమ్మమ్మ ఏంటి ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు నీ మనవరాలు నా మీద ఏమైనా కంప్లైంట్‌ ఇస్తుందా..? ఏంటి అనగానే.. నాభర్త నన్ను బాగా చూసుకోవడం లేదని చెప్తున్నాను.. అంటూ ఇందు చెప్పగానే.. రాజు కంగారుపడతాడు.. ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు అంటే.. అపర్ణ అవును బాబు నిజమే మీ నాన్నకు కూడా ఫోన్‌ చేద్దాం అంటుంది అని చెప్పగానే.. రాజు కంగారుపడతాడు. అపర్ణ, ఇందు నవ్వుకుంటారు.. ఇందు, రాజును తీసుకుని రూంలోకి వెళ్లి వ్రతం గురించి చెప్తుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Big Stories

Advertisement
×