E-Paper
Advertisement

Huge Fire Accident at KIA Company: అనంతపురం కియా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్థి నష్టం.. ఏం జరిగింది?

Huge Fire Accident at KIA Company: అనంతపురం కియా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్థి నష్టం.. ఏం జరిగింది?
Advertisement

Huge Fire at KIA Company in Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియో కార్ల అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దాదాపు 15 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.

అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..కియా అనుబంధ పరిశ్రమ ఎన్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్లకు సంబంధించి హెడ్ లైట్లు, గ్లాసులు తయారు చేసే పరిశ్రమ ఇది.

Advertisement

సాయంత్రం కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో నిప్పురవ్వులు ఎగిరిపడ్డాయి. పక్కనే ఉన్న దుస్తులకు తొలుత మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల్లో యంత్రాలు ఇతర సామాగ్రి కాలిబూడిదయ్యాయి.

Also Read: Chandrababu SPG increased : బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా?

Advertisement

కార్మికులు మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల ప్రభావానికి గాజు గ్లాసులు ఎగిరిపడ్డాయి. సమాచారం తెలియగానే పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. పెనుకొండ, హిందూపురం ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Huge fire at KIA company
Huge fire at KIA company

మంటలు ఆర్పే క్రమంలో ఇద్దరు కార్మికులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. నష్టం ఇంకా అంచనా వేయాల్సి ఉందని కంపెనీ ఉద్యోగులు చెప్పుకొచ్చారు.

Also Read: Court serious on Palnadu incidents: పల్నాడు ఘటన..కోర్టు సీరియస్, ఈసీతోపాటు

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×