BigTV English

High Court Serious on Palnadu Incident: పల్నాడు ఘటనపై హై కోర్టు సీరియస్.. ఈసీతోపాటు..

High Court Serious on Palnadu Incident: పల్నాడు ఘటనపై హై కోర్టు సీరియస్.. ఈసీతోపాటు..

High Court Serious on Palnadu Incidents: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందేకాదు.. తర్వాత కూడా హింస కంటిన్యూ అయ్యింది. దాదాపు మూడురోజులపాటు పల్నాడు ప్రాంతం భగ్గుమంది. ముఖ్యంగా మాచర్ల, గురజాల, నరసారావుపేట, అనంతపురంలోని తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు జరిగాయి. తిరుపతిలోని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై దాడి జరిగింది. ఈ వ్యవహారంపై వినుకొండకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.


హింసాత్మక ఘటనలు అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, అదనపు బలగాలను మొహరించాలంటూ అందులో ప్రస్తావించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన హింసపై రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ప్రపంచానికి చూపామని, అందరూ చూశారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆధారాలను పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, డీజీపీ, ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది న్యాయస్థానం. భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాల్సింది హోంశాఖ అని తెలిపింది. పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, 144 సెక్షన్ విధించినట్టు చెప్పుకొచ్చారు. అదనపు బలగాలను మోహరించామని వివరించారు.


Also Read: ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ లేఖ.. మీ ప్రేమ కదిలించిందంటూ..

అటు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానికి వ్యక్తిగత భద్రత కల్పించామని, ఆయన ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు చేశారు పోలీసు తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. నాని వైఫ్, ఆయన కొడుకు భద్రత కల్పించే విషయంలో వివరాలు సమర్పించేందుకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను ఈనెల 23కి వాయిదా వేసింది. తనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఫ్యామిలీ సభ్యులకు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాని ఫ్యామిలీ సభ్యులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×