Rs. 170 Crore Seized in Maharashtra: ఎన్నికల ముందేకాదు, తర్వాత కూడా ఆదాయపు పన్ను శాఖ కొందరు వ్యాపారులపై కొరడా ఝులిపించింది. తాజాగా అవినీతి భారీ తిమింగళం చిక్కింది. మహారాష్ట్రలోని నాదేండ్ ప్రాంతంలో భండారీ సోదరుల ఇళ్లు, ఆఫీసులపై సోదాలు చేపట్టారు. ఇందులో లెక్క చూపని 170 కోట్ల అక్రమ సంపద బయటపడింది. వెంటనే దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మూడురోజుల కిందట పూణె, నాసిక్ నుండి దాదాపు 30 నుంచి 40 మంది ఐటీ అధికారులు నాందేడ్‌కు వాహనాల్లో వచ్చారు. ఏకకాలంలో భండారీ బ్రదర్స్, బంధువులు, ఇళ్లు, ఆఫీసులపై సోదాలు చేపట్టారు. దాదాపు 14 కోట్ల రూపాయల నగదు, ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది. దీనికితోడు లెక్కలేని ఆస్తులున్నాయి.
ముఖ్యంగా చిట్ ఫండ్స్, మైక్రో ఫైనాన్స్, గోల్డ్ లోన్ కంపెనీలను నడుపుతున్నారు సంజయ్ భండారీ బ్రదర్స్. ఇవేకాకుండా వాటి అనుబంధ సంస్థలపై కూడా ఐటీ కన్నేసింది. ఇటీవల కాలంలో పన్ను ఎగవేత వేస్తూ వచ్చారు. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు దాదాపు మూడురోజులపాటు రైడ్స్ చూసింది. సోదాల్లో పట్టుబడిన 170 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
Also Read: రెండు వాహనాలు ఢీ.. 8 మంది మృతి
ఇవేకాకుండా కంపెనీలకు సంబంధించి ఖాతా పుస్తకాలు, హార్డ డిస్క్‌లను సీజ్ చేశారు. రెండేళ్ల కిందట ఫైనాన్స్ కంపెనీలను భండారీ బ్రదర్స్ ప్రారంబించారు. వినియోగదారుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు లేకపోలేదు. మొత్తం డీటేల్స్ సంపాదించిన తర్వాత సోదాలు చేపట్టింది.