Husband killed his wife: వారిద్దరు భార్యభర్తలు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేరు. ఏం జరిగిందో తెలీదు. భార్యపై అనుమానం వచ్చింది. ఆ బాధను దిగమింగేందుకు మద్యానికి అలవాటుపడ్డాడు భర్త. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ ఇల్లాలు ఎంతవరకు ఓపిక పడుతుంది. చివరకు పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. కొద్దిరోజులు జైలులో ఉన్నాడు.. భార్యపై అనుమానం మరింత రెట్టింపయ్యింది. ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం కత్తితో పొడిచి భార్యను చంపాడు. సంచలనం రేపిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగి ప్రాంతానికి చెందిన చాట్ల జాన్‌తో దివ్య భారతికి పెళ్లయ్యింది. ఈ దంపతులను చూసి ఊరులోనివారు అసూయపడేవారు. మాకు ఇలాంటి కూతురు గానీ, అల్లుడుగానీ ఉంటే బాగుండేదని అనుకునేవారు. కాల క్రమంలో వీరికి ఇద్దరు కొడుకులు, ఓ అమ్మాయి పుట్టారు. కుటుంబం గడవపోవడంతో ఐదేళ్ల కిందట రాజానగరం నియోజకవర్గం పురుషోత్తపట్నానికి వలస వచ్చారు. చిన్నదుకాణం పెట్టుకుని జీవనం సాగించేవారు. మరి ఏం జరిగిందో తెలీదు.
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తకు.. భార్యపై అనుమానం వచ్చింది. రోజు రోజుకూ తీవ్రమైంది.. చివరకు జాన్ అనుమానం పెనుభూతమైంది. ఆ బాధను దిగమింగేందుకు మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్య దివ్యభారతిని తరచూ వేధించేవాడు. భర్త టార్చర్ తీవ్రం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసులు జైలుకి పంపారు.
ALSO READ:ఏపీలో పరువు హత్య, మైనర్ బాలిక పెళ్లి చేసుకుందని, ఇంటికి తీసుకొచ్చి ఆపై..
జైలు నుంచి వచ్చినా జాన్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పురాలేదు. అనుమానం మాత్రం వెంటాడుతోంది. చివరకు భార్యను చంపాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇందుకోసం ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. కత్తితో పొడిచి చంపాలని నిర్ణయానికి వచ్చేశాడు. ఏ సమయంలో చేయాలనేదానిపై తర్జనభర్జన పడ్డాడు. ఇంట్లో అయితే పిల్లలు ఉంటాడని భావించాడు జాన్.
తెల్లవారుజామున కాలకృత్యాలకు వెళ్లిన భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపేశాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. సమస్యను పరిష్కరించాల్సిన భర్త.. అనుమానం పెంచుకున్నాడు. చివరకు పిల్లలను తల్లి లేని అనాధలను చేశాడు.