
ICC World Cup Update(AP latest news):
ఇండియా -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందనన్న ఆవేదనతో ఓ క్రికెట్ అభిమాని కలత చెందాడు. హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతిష్ కుమార్ యాదవ్ క్రికెట్ అభిమాని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేస్తున్నాడు.. దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు. వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో తిలకిస్తు ఉండగా.. ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు తిరుపతి రూయాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే జ్యోతిష్ కుమార్ యాదవ్ మృతి చెందాడు.
ఆదివారం మధ్యాహ్నం.. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ ఇవ్వడంతోనే ఉత్కంఠపోరు మొదలైంది. మొదటి బంతితోనే తానేంటో చూపించిన ఆస్ట్రేలియాను ఎదుర్కొని పరుగులు చేయడం ఇండియాకు కష్టతరంగా మారింది. రోహిత్ – గిల్ కలిసి కనీసం సెంచరీ అయినా చేస్తారని ఆశించిన యావత్ భారత్ ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురైంది. గిల్ నాలుగు పరుగులకే అవుట్ అవ్వగా.. రోహిత్ 47 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్, కోహ్లీ వికెట్లు పడిపోవడంతో.. కేఎల్ రాహుల్ 66 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. ఇండియా బౌలింగ్ తో ఆసీస్ ను కట్టడి చేస్తుందనుకున్నారు. ఆరంభంలో ఫటాఫట్.. హ్యాట్రిక్ వికెట్లు తీసినా.. ఆ తర్వాతి నుంచి ఒక్క వికెట్ కూడా పడలేదు. ఇంకా రెండు పరుగులతో ఆస్ట్రేలియా గెలుస్తుందనగా.. గిల్ క్యాచ్ తో హెడ్ అవుటయ్యాడు. మ్యాక్స్ వెల్ బరిలోకి దిగి.. ఒక్కషాట్ తో రెండు పరుగులు తీసి వరల్డ్ కప్ ఎగరేసుకుపోయాడు. ఇండియా మళ్లీ వరల్డ్ కప్ గెలవాలంటే.. 2027 టోర్నీ వరకూ ఆగాల్సిందే.