E-Paper
Advertisement

ఇచ్చాపురంలో వైసీపీ ఘోర పరాజయం.. ఓటమికి అసలు కారణం అదేనా..?

ఇచ్చాపురంలో వైసీపీ ఘోర పరాజయం.. ఓటమికి అసలు కారణం అదేనా..?
Advertisement

Ichchapuram YSRCP: ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి అభ్యర్థుల ఎంపిక, సమన్వయ లోపం, కేడర్‌ను కలుపుకుపోలేకపోవడమే కారణమన్న చర్చ ఉంది. అదే ప్రభావం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కనిపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు కూటమి శ్రేణులను సమన్వయం చేస్తూ టీడీపీని బలోపేతం చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీలో మాత్రం వర్గ విభేదాలు, అంతర్గత అసంతృప్తి పార్టీకి ఇబ్బందిగా మారిందన్న చర్చ సాగుతోంది.

పార్టీలో వర్గపోరు..

శ్యాం ప్రసాద్ రెడ్డి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో వర్గపోరు పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీనియర్లను పక్కన పెట్టడం, పదవుల నుంచి తొలగించడం కూడా కేడర్‌లో అసంతృప్తికి కారణమైందన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అసంతృప్తి మరింత బహిరంగమవుతోంది. సోషల్ మీడియాలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే నాయకత్వంపై విమర్శలు వస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీకి డ్యామేజ్..

Advertisement

వరుస ఓటములు ఒకవైపు.. కేడర్‌లో అసంతృప్తి మరోవైపు.. ఇచ్చాపురంలో వైసీపీకి డ్యామేజ్ కంట్రోల్ తప్పనిసరిగా మారింది. శ్యాం ప్రసాద్ రెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త ఇన్‌ఛార్జిని తీసుకొస్తారా? అన్నదే క్వశ్చన్.

Also read: మెక్సికో ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలకు.. హుస్నాబాద్ ఆడబిడ్డ ఎంపిక!

Tags

Related News

విశాఖ సీఐఐ సదస్సులో ఏపీకి రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు!

ఏపీకి సినీ పరిశ్రమ.. మంత్రి లోకేశ్ మాస్టర్ ప్లాన్.. వైజాగ్‌కు ‘భల్లాలదేవుడి’ కీలక భరోసా!

12 ఏళ్ల తర్వాత రాజమండ్రి నగర పోరు.. కూటమి జోరుకు వైసీపీ చెక్ పెడుతుందా?

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఏపీలో రూ.1.20 లక్షల కోట్లతో రహదారి ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. ఏపీకి వచ్చిన మొత్తం పెట్టుబడులు ఇవే..?

ఏపీకి మరో భారీ తుఫాన్ ముప్పు.. ‘అక్వాన్’ తుఫాన్‌ అనే పేరుతో నామకరణం!

Big Stories

Advertisement
×