Cyclone Alert: ఏపీకి మరో భారీ తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం కారణంగా ఈ నెల 16న తుఫాన్‌గా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారుల అబిప్రాయపడుతున్నారు. ఓకవేల ఇది తుఫాన్‌గా మారితే దీనికి అక్వాన్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని సముద్రతీరం వైపున భారీగా ఈదురుగాలుల తీవ్రత ఉంటుందని తుఫాన్ గమనం ఉత్తర కోస్తా వైపు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ 19వ తేదీ సాయంత్రం కల్లా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది వాయవ్య దిశగా పయనించి రేపు సుస్పష్టమైన అల్పపీడనంగా, ఎల్లుండి ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఆతదుపరి ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదివారం నుంచి సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు –కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: బైక్ కాదు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!