Rajahmundry Elections:రాజమండ్రి నగర పాలక సంస్థకు చివరి సారి 2014లో ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా 2021లో ఎన్నికలు జరగలేదు. 2014 ఎన్నికల్లో కార్పొరేషన్ లో మెజారిటీ సాధించిన తెలుగుదేశం ఇపుడు జనసేన-బిజెపిలతో కలిసి దూకుడు మీద ఉంది. గతంలో సాధించిన స్థానాలకు మించి ఈ సారి విజయాలు సొంతం చేసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.గతంలో 50 డివిజన్లు ఉండే కార్పొరేషన్ లో పరిసర గ్రామాల విలీన నేపథ్యంలో డివిజన్ల సంఖ్య 72 కి పెరిగింది. దీంతో కార్పొరేటర్ అయిపోదామని ఆశపడే వారి సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి కూటమి తరపున టికెట్ సంపాదించడానికి కూటమి పక్షాల నేతలు పోటీలు పడుతున్నారు.2014 ఎన్నికల్లో 50 డివిజన్లలో టిడిపి 34 చోట్ల విజయకేతనాలు ఎగరేసింది. వైసీపీ అప్పట్లో 8 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.ఈ సారి మరో 22 డివిజన్లు వచ్చి చేరడం అందులో కీలక గ్రామీణ ప్రాంతాలు ఉండడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలున్నాయి.
రాజమండ్రిలో కూటమి దుమ్మురేపే విజయాలు..?
2024 ఎన్నికల్లో రాజమండ్రిలో కూటమి దుమ్మురేపే విజయాలు సొంతం చేసుకుంది. అదే జోరును కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని టిడిపి నాయకత్వం పట్టుదలగా ఉంది. హుకుంపేట,కాతేరు,బొమ్మూరు,ధవళేశ్వరం,పిడింగొయ్యి వంటి విలీన గ్రామాల్లో ఎవరికి ఆధిపత్యం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 12 ఏళ్లుగా పాలక మండలి లేని కార్పొరేషన్ లో చాలా సమస్యలున్నాయి. తాగునీరు,డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు,పారిశుధ్యం అంశాల్లో ప్రజల నుండి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. గతంలోక న్నా ఎక్కువ డివిజన్లు గెలవడంతో పాటు మేయర్ పదవిని దక్కించుకుని తీరాలని వైసీపీ పంతంగ ఉంది. అయితే కూటమి మాత్రం వైసీపీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వనే కూడదని పకడ్బందీ వ్యూహాలతో అడుగులు వేస్తోంది. ఎవరు గెలిచినా రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని జనం కోరుతున్నారు.
Also Read: చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్