AP Investments: విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడుల వెల్లువ! 31వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించగా.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు సమ్మిట్‌లో ఏం జరిగింది? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఏ రంగాలకు ప్రాధాన్యత లభించింది?
విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన 31వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఘనంగా ముగిసింది . దాదాపు 66 దేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.సమ్మిట్ తొలి రోజే 73 అవగాహన ఒప్పందాలు, 15 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మొత్తం 5 లక్షల 84 వేల 355 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా లక్షా 7 వేల 693 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.ఇక రెండో రోజు మరో 12 ఒప్పందాల ద్వారా లక్షా 41 వేల 585 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించారు. వీటి ద్వారా మరో 10 వేల 919 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు.మంచి చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం..సీఐఐ వేదికగా పెట్టుబడుల ప్రవాహమే అందుకు నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు.పారిశ్రామిక వేత్తలకు . ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందన్నారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.
Also Read: టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!
సౌర విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్లోనూ పెట్టుబడులు పెట్టాలని చారు. RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాకు సూచించారు సీఎం చంద్రబాబు.పేదలకు అండగా నిలిచేందుకు పీ4 కార్యక్రమంలో RPSG భాగస్వామి కావాలన్నారు. భారత్‌లో ఖతార్ రాయబారి మహ్మద్ హసన్ అల్ జబీర్ భేటీ అయ్యారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, గ్రీన్ ఎనర్జీ, పెట్రో కెమికల్స్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1,750 కోట్లతో ఫ్లోట్ గ్లాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సెయింట్ గోబెన్ సిద్ధమైంది. అమరావతిలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటుకు ఓబెరాయ్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక సీఐఐ సమ్మిట్ రెండో రోజు మంత్రి లోకేష్ సమక్షంలో24 దిగ్గజ కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. CII సమ్మిట్‌లో మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. నటుడు దగ్గుబాఇ రాణా.. హైదరాబాద్ తరహాలో విశాఖ సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ అగ్రపథంలో వుందన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఏపీకి పోర్టులు ఓ వరం అన్నారు కేంద్రమంత్రి గడ్కరీ. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పారిశ్రామిక వేత్తల్లో నమ్మకానికి ఈ సదస్సు అద్దం పట్టిందన్నారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఆటోమొబైల్స్, స్పేస్ టెక్నాలజీ, రక్షణ రంగం, పోర్టుల అభివృద్ధి వంటి అంశాలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 400కు పైగా బిజినెస్ టు బిజినెస్ సమావేశాలకు వేదికైంది ఈ సమ్మిట్.
Also read: జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్స్క్రిప్షన్!