E-Paper
Advertisement

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
Advertisement

CP Radhakrishnan: సొంత రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోతే ఎలా అని బాధపడే రోజులు పోయి, ఇప్పుడు విదేశీ పెట్టుబడిదారులు సైతం క్యూ కట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలను చవిచూసినా.. నేడు ఏపీ అభివృద్ధిలో దేశానికే రోల్‌మోడల్‌గా మారుతోంది. విశాఖ వేదికగా ముగిసిన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రగతిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును ప్రత్యేకంగా కొనియాడారు.

చంద్రబాబు విజన్‌తోనే ఏపీ ప్రగతి

Advertisement

ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఉండటం ఆ రాష్ట్ర అదృష్టమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రశంసించారు. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఇప్పుడే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం సీఎం చంద్రబాబు అసాధారణ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతోందని, విభజన గాయాలను తట్టుకుని ఏపీ వేగంగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడుల ప్రవాహం.. రికార్డు స్థాయి వృద్ధి

Advertisement

2024 జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీ ఆకర్షించడం సాధారణ విషయం కాదని ఉపరాష్ట్రపతి అన్నారు. విశాఖ సీఐఐ సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు వచ్చాయని.. ఇందులో ఏకంగా 76 శాతం ఒప్పందాలు సఫలమవుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, టూరిజం వంటి రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలుస్తోందని వెల్లడించారు.

భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు

రాబోయే కాలంలో టెక్నాలజీనే ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్‌గా మారుతుందని, పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించడం అభినందనీయమని సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ప్రధాని మోదీ కలలుగన్న ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా ‘స్వర్ణాంధ్ర’ సాధన దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. ‘వర్క్ టుగెదర్, గ్రో టుగెదర్, షేర్ ప్రాస్పెరిటీ’ (కలిసి పని చేద్దాం, కలిసి ఎదుగుదాం, సంపదను పంచుకుందాం) అనే నినాదంతో అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: ఏపీలో రూ.1.20 లక్షల కోట్లతో రహదారి ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Tags

Related News

12 ఏళ్ల తర్వాత రాజమండ్రి నగర పోరు.. కూటమి జోరుకు వైసీపీ చెక్ పెడుతుందా?

ఏపీలో రూ.1.20 లక్షల కోట్లతో రహదారి ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. ఏపీకి వచ్చిన మొత్తం పెట్టుబడులు ఇవే..?

ఏపీకి మరో భారీ తుఫాన్ ముప్పు.. ‘అక్వాన్’ తుఫాన్‌ అనే పేరుతో నామకరణం!

‘భోగాపురంపై హ్యాపీగా లేను.. అది జరిగిన రోజు ఎంతో సంతోషిస్తా’.. రానాతో లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

నాడు చదువుకు పండుగ.. నేడు దండుగ.. ఫీజు బకాయిలపై వైఎస్ షర్మిల ధ్వజం

అలాంటి వివక్ష తగదు.. ఉపాసనతో ఇంటర్వ్యూ- మంత్రి లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×