E-Paper
Advertisement

CM YS Jagan: విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ హస్తం.. సీఎం జగన్ సంచలన ఆరోపణలు

CM YS Jagan: విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ హస్తం.. సీఎం జగన్ సంచలన ఆరోపణలు
Advertisement

CM YS JaganCM YS Jagan: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిపై విమర్శలు గుప్పించారు. నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు శవరాజకీయాలు, కుట్రలు అలవాటు అయ్యాయని విమర్శించారు. విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ హస్తం ఉందని ఆరోపణలు చేశారు.

ఇది సరిపోదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారని అన్నారు. వివేకా చిన్నానను అతిదారుణంగా చంపి.. బహిరంగంగా హంతకుడు తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి చంద్రబాబే మద్దతు ఇచ్చి కాపాడుతున్నారని విమర్శించారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో.. కానీ చంద్రబాబు నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నారని అన్నారు. దాన్ని రాజకీయం చేసి తనపైన నెట్టేయడానికి చూస్తున్నారని అన్నారు.

Advertisement

తనని దెబ్బ తీయడానికే చంద్రబాబు ఇలాంటి రాజకీయ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ కుంటుంబ సభ్యులే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.

విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ నాయకులు హస్తం లేకున్నా టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా సరే తమ వెంట వైఎస్సార్ జిల్లా ప్రజలు ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తమదని వెల్లడించారు. పేదల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం 2.70 లక్షల కోట్లు వారి అకౌంట్లో నేరుగా జమ చేశామని జగన్ తెలిపారు.

Advertisement

Also Read: BJP Candidates List: ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. సుజనా పోటీ అక్కడి నుంచే..

పేదలు ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆ ప్రజలు, దేవుడ్ని నమ్మకున్నా.. మే 13న మీరు రెండు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×