Big Stories

Naveen Chandra in Indpector Rishi: నా బెడ్ రూమ్ లో దెయ్యం.. 100 రోజులు ప్రతి రోజు కనిపించేది

- Advertisement -

Naveen Chandra Speech in Inspector Rishi Event: అందాల రాక్షసి సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నవీన్ చంద్రకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఎదుగుతూ.. విలన్ గా,  సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా ఈ హీరో ఓటిటీ బాట పట్టాడు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా వస్తున్న ఇన్స్పెక్టర్ రిషి లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. హారర్ క్రైమ్ కథతో తెరకెక్కిన ఈ సిరీస్ కు నందిని దర్శకత్వం వహించగా.. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

- Advertisement -

ఇక ఈ ప్రెస్ మీట్ లో నవీన్ చంద్ర మాట్లాడుతూ .. “ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్ డే. ఆయనకు ముందుగా నా తరపున బర్త్ డే విషెస్  చెబుతున్నా. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ గారితో కలిసి నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గ్రేట్ యాక్టర్. నేను హారర్ కంటెంట్ చేసి చాలా రోజులవుతోంది. ఇన్స్ పెక్టర్ రిషి వెబ్ సిరీస్ కథ విన్నప్పుడు ఇందులో హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్ …లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయనిపించింది. ఈ సిరీస్ ఎందుకు చేయకూడదు అని దూకేశాను. ఇలాంటి క్యారెక్టర్ దక్కడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్ లోనూ అనేక లేయర్స్ ఉంటాయి. హారర్ థ్రిల్లర్స్ లో ఇదొక స్పెషల్ సిరీస్ అవుతుంది.

Also Read: Suriya 44: అప్పుడే మరో సినిమాను లైన్లో పెట్టిన సూర్య.. పోస్టర్ అదుర్స్

ఇక ఈ సిరీస్ కోసం దాదాపు 100 రోజులు వర్క్ చేశాను. రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్.. బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది. ఎందుకంటే నాకు దెయ్యానికి చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను మా డైరెక్టర్ నందిని గారిపై నమ్మకంతో ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ మేక్ బిలీవ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. 10 ఎపిసోడ్స్ సిరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్ ముగిశాక నెక్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఈ సినిమాకు సూపర్బ్ టాలెంటెడ్ టీమ్ వర్క్ చేసింది. వీఎఫ్ఎక్స్ టీమ్, మేకప్ టీమ్ కు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్స్ పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది నాకు మెసేజ్ లు పంపారు. భయమేసేలా ఉంది అయినా కూడా మేము ఈ సిరీస్ చూస్తాం అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మా సిరీస్ ట్రైలర్ ను కాజల్ చూశారు. చూసి చాలా బాగుంది.. నేను షేర్ చేస్తా అని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తప్పకుండా ఈ సిరీస్ చూస్తానని కాజల్ చెప్పారు. ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 29న ఇన్స్ పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో చూస్తారని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ సిరీస్  నవీన్ చంద్రకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News