Illu Illalu Pillalu ToIlluday Episode August 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నర్మదలు శ్రీవల్లిని ఆడుకుంటారు. బొద్దింక పడిన ఉప్మాని తింటే చచ్చిపోతారేమో కదా అని ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకోవడం విని శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏంటి బొద్దింకపడిన ఉప్మాని నేను తినేసానా అని శ్రీవల్లి షాక్ అవుతుంది. మమ్మల్ని ఆడుకోవాలని చూస్తావా అందుకే నిన్ను ఆడుకున్నామని నర్మదా ప్రేమ అంటారు. శ్రీవల్లి చచ్చిపోతానేమో అని భయంతో బయటికి వెళ్లి వాంతులు చేసుకుంటుంది. ఈ విషయం ఎలాగైనా అందరికీ చెప్పాలని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా శ్రీవల్లి అక్క వాంతులు చేసుకుంటుంది రండి చూడండి తల్లి కాబోతుందేమో అని అంటారు. ఆ మాట వినగానే అందరూ అక్కడికి వచ్చి చూసి ఇన్నాళ్లకు నా ఇంట్లో మనోడు తిరగబోతున్నారంటూ వేదవతి సంతోషపడుతుంది. భాగ్యం ను రప్పించడమే నర్మదా ప్లాన్ అదే చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. వేదవతి భాగ్యం వాళ్లకు ఫోన్ చేసి శుభవార్తను పంచుకుంటారు. భాగ్యం, ఆనందరావు ఆనందానికి అవధులు లేవు. తల్లి కాబోతుందని సంతోషంతో వెంటనే అక్కడికి వచ్చేస్తారు. పాత బండి మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మన బండారం తెలిసిపోతుందని బండిని దాచిపెట్టి ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళ చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. చూశారా అన్నయ్యగారు ఇద్దరు కోడలు ముందు వచ్చిన నా కూతురే మిమ్మల్ని తాత ఏం చేయబోతుంది అని అంటారు. ఈ మాటలు విన్న శ్రీవల్లి అమ్మ నేను తల్లిని కాలేదమ్మా.. ఉప్మా తిని వాంతులు అయ్యాయి అని అసలు విషయం చెప్తుంది. ఆ మాట విన్న వేదవతి సీరియస్ అవుతుంది..
నర్మదా ప్రేమలే నా చేత బొద్దింక పడ్డ ఉప్మాని తినిపించారు. అందుకే వాంతులు చేసుకున్నాను అని శ్రీవల్లి అంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు.. నువ్వు మా మీద ఎన్ని రకాలుగా చెప్పినా సరే నేను నిన్ను సొంత అక్కలాగే చూశాను నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు అని రివర్స్ అవుతారు. ఏంటమ్మా వల్లి ఇలాంటివి ఎలా చెప్పాలో కూడా తెలియదా? వాళ్ళంటే నీకు ఇష్టం లేకపోతే ఉండాలి ఇలా నిందలు వేయడం మంచిదేనా అని రామరాజు అంటాడు. శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే శ్రీ ఫలిత తప్పు అని అందరూ అంటారు.
భాగ్యం ఆనందరావు అమ్ముడు తలగబోతుందని అక్కడ చాలా పనులు వదిలేసి వచ్చాము. వెళ్ళిపోతున్నామని మెల్లగా జారుకుంటారు. అల్లుడుగారు 10 లక్షల గురించి అడిగేటట్టున్నాడు మనం వెళ్ళిపోదాం పద అని ఆనందరావు తీసుకొని బయటికి వచ్చేస్తుంది. మనం అక్కడ ఇంకా సేపు ఉంటే పది లక్షలు గురించి అల్లుడు అడిగేవాడు. ఆ సంగతి మర్చిపోయాను అని ఇద్దరు కలిసి స్పీడుగా మళ్లీ తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరుతారు. వెనకాలే నర్మదా ప్రేమలు ఫాలో అవుతుంటారు..
Also Read : వీకెండ్ ఓటీటీలోకి 37 సినిమాలు..అవి ఏంటంటే..?
వీళ్ళు ఇద్దరు కారులో వచ్చామని ఇలా పాత డొక్కు స్కూట మీద వచ్చారు చూసావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. ఆనందరావుకే ఎదురుగా ఒక బండ తినడంతో అతనితో గొడవకు దిగుతాడు. బండి అద్దం నుంచి నర్మద ప్రేమ కనిపించడం చూసి భాగ్యం అనుమానాన్ని ఫాలో అవుతున్నారు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటారు. స్కూటర్ ను అక్కడ పడేసి సంధులు గొందులలో పరుగులు పెడతారు. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళని వెతికే ప్రయత్నంలో ఉంటారు. భాగ్యం, ఆందరావుకు చుక్కలు కనిపిస్తాయి. ఖచ్చితంగా ఎలాగైనా మామయ్య వీళ్ళను పట్టించాలి అని నర్మద, ప్రేమలు ఫిక్స్ అవుతారు. బస్తి మొత్తాన్ని జల్లెడ పట్టి వెతుకుతారు. నర్మద భాగ్యం దగ్గరకు వస్తుంది. వాళ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.. మరి సోమవారం ఎపిసోడ్లో వాళ్ళ బంగారం బయటపడుతుందా? తప్పించుకుంటారా అన్నది చూడాలి.. ఏది ఏమైన శ్రీవల్లి బండారం బయటపడితే రామరాజు క్షమిస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.