E-Paper
Advertisement

OTT Movie : ‘వారణాసి’ కంటే ముందు చూడాల్సిన రాజమౌళి టాప్ 7 సినిమాలు… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

OTT Movie : ‘వారణాసి’ కంటే ముందు చూడాల్సిన రాజమౌళి టాప్ 7 సినిమాలు… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

OTT Movie : ఎస్.ఎస్. రాజమౌళి భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా పేరు పొందాడు. ఇతని పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. 2001లో జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన ‘స్టూడెంట్ నెం. 1’ తో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ‘బాహుబలి’  ‘RRR’ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆయన తన చిత్రాలకు నంది పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను 2016లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే భారీ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది భారతీయ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి ముందు మీరు తప్పక చూడాల్సిన రాజమౌళి సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. బాహుబలి: ది బిగినింగ్ (2015)

ఒక జానపద కథతో రెండు భాగాలుగా వచ్చిన “బాహుబలి” మొదటి భాగంగా “బాహుబలి : ద బిగినింగ్” 2015న సంవత్సరం జూలై 10వ తేదీన విడుదలయింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించగా, కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. ఎం.ఎం.కీరవాణి దీనికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించడం జరిగింది. భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది. దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది. దీనిని జియో హాట్ స్టార్ లో చూడచ్చు.

2. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017)

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అని ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఉత్కంఠంగా ఎదురు చూసారు. దీంతో ఈ సినిమా ఊహించిన దానికంటే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. ‘బాహుబలి 2: ది కన్ క్లూజన్’ తో పాటు మొదటి పార్ట్ కి కలిపి ₹250 కోట్లు ఖర్చు చేసారు. అయితే 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2017 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసారు. విడుదలైన తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మొదటి వారంలోనే 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో అమరేంద్ర బాహుబలి చనిపోయిన తరువాత, మహేంద్ర బాహుబలి ఎల రాజుగా రాజ్యాన్ని ఎలుతాడో చూపిస్తుంది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

3. ‘ఆర్ఆర్ఆర్’ (2022)

ఈ సినిమాలో స్వతంత్ర సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను కల్పిత పాత్రల్లో చూపించాడు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ సినిమా భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయి సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 300 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. 2022 మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా 15 రోజుల్లో 1000 కోట్ల క్లబ్ చేరుకుంది. జపాన్ లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జీ5లలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

4. ఈగ (2012)

నాని, సమంత నటించిన ఈ సినిమా రాజమౌళి అత్యంత సృజనాత్మకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది 2012 జులై 6న రిలీజ్ అయింది. విజువల్స్ పరంగా రాజమౌళి ప్రతిభని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. హీరో లేకుండానే ఒక ఈగతో స్టోరీని నడిపించి భారీ హిట్ కొట్టాడు ఈ దర్శక ధీరుడు. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్, ఆహా, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

5. మగధీర (2009)

సినిమా రామ్ చరణ్ కెరీర్ నే ఒక్క సారిగా మలుపు తిప్పింది. కాజల్ అగర్వాల్ చరణ్ కి జోడిగా నటించింది. ఈ రొమాంటిక్ యాక్షన సినిమా, నాలుగు వందల సంవత్సారాల ముందు, వెనుక జరిగే ఈ కథతో ఆడియన్స్ ని మంత్రముగ్ధులను చేసింది. ఇది రాజమౌళి అద్భుతమైన విజయాలలో ఒకటిగా నిలిచింది. MX ప్లేయర్, YouTube లో ఇది అందుబాటులో ఉంది.

6. ‘ఛత్రపతి’ (2005)

రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా ఇది. ప్రభాస్, శ్రీయ ఇందులో జంటగా నటించారు. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణికి, ఉత్తమ సహాయనటిగా భానుప్రియకు నంది పురస్కారాలు దక్కాయి. 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పట్లో ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది. ఇది ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

7. ‘సై’ (2004)

రాజమౌళి తొలినాటి రత్నాలలో ఒకటైన సై, భారతదేశంలో అరుదుగా కనిపించే రగ్బీ గేమ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా రాజమౌళిలోని ప్రతిభకి సాన పెట్టింది. 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా నిలిచింది. ఇందులో నితిన్, జెనీలియా, శశాంక్ ప్రధాన పాత్రలు పోషించారు. సై చిత్రానికీ కధ విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతం ఎం ఎం కీరవాణి అందించాడు. మహేష్ ‘వారణాసి’ మూవీ వచ్చే లోపు ఈ సినిమాలపై ఓ లుక్ వేయండి.

Read Also : పెళ్ళాం మిస్సింగ్… పక్కింటోడిపై కన్ను… ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులోనే

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×