Jagan: జనాభా పెంచాలని పదే పదే సీఎం చంద్రబాబు చెప్పడం, దానికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేయడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న కానుకకే ఇప్పటివరకు దిక్కులేదన్నారు. ముగ్గురు పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తామని చెప్పడాన్ని తప్పుబట్టారు.
ముగ్గురు పిల్లలకు డబ్బులా? సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
చాన్నాళ్లు గ్యాప్ తర్వాత బుధవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అంటూ ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ప్ డబ్బాలు తప్ప ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
ఈ విషయంలో ప్రజలకు ఒరిగింది మాత్రం సున్నగా వర్ణించారు. సీఎం చంద్రబాబు తన కొడుకును జాకీ పెట్టి లేపుతారని, లోకేష్ తన తండ్రిని జాకీ పెట్టి లేపుతారని అన్నారు. వీరిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీ పెట్టి లేపుతారని గడిచిన అసెంబ్లీలో జరిగిదంతా ఇదేనన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రెండు పనులు చేశారని అన్నారు. ఒకటి పెన్షన్లు ఇవ్వడం, రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేయడమేనన్నారు.
విశాఖలో కోట్ల విలువైన భూములను సమీప బంధువుకు కట్టబెట్టారంటూ ఆరోపణలు
ఇది తప్ప ఆయన ఏదీ చేయరని తేల్చేశారు. ఎక్కడికి వెళ్లినా రెవిన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తానని, సర్వే చేయిస్తానని అంటున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ మా హయాంలో చేస్తామని గుర్తు చేశామన్నారు. సర్వేయర్ల, సచివాలయం వ్యవస్థ మావల్ల వచ్చిందన్నారు. విమానాలు, హెలికాప్టర్లు సర్వే చేస్తూ ఎవరి హయాంలో తిరిగాయి? ఈ విషయంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న పనులన్నీ మా హయాంలో వచ్చాయని చెప్పి క్రెడిట్ వేసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. పెట్టుబడులు పెట్టాలని డీఎల్ఎఫ్ సంస్థను ఆహ్వానించారు. దీనిపై డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా ఆయనపై విరుచుకుపడ్డారు. విశాఖపట్న సిటీలో ఐదు వేల కోట్ల విలువైన భూమిని సమీప బంధువుకు సీఎం చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు.
ALSO READ: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్లు, ఇంకెందుకు ఆలస్యం
ఈ విధంగా భూములు కట్టబడితే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెలక్కాయలు, బెల్లానికి అతి తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తుస్తున్నారని ఆరోపించారు. వాళ్లు నిర్మించే భవనంలో చదరపు అడుగుకు 2 వేల రూపాయలు ఎదురు ఇస్తున్నారని కొత్త విషయాన్ని బయటపెట్టారు.
ఇలాంటి స్కామ్‌లు జరిగితే ఆదాయం ఎలా వస్తుందంటూ కుండబద్దలు కొట్టేశారు. తాము పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశామంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. మా ఐదేళ్లలో ట్రాక్ రికార్డు అంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారాయన. అటు టీటీడీ గురించి కూడా ప్రస్తావించారు. మా హయాంలో 75 వేల విలువైన డాలర్ల చోరీ జరిగిందని నిజం అంగీకరించారు. ఎట్ ద సేమ్ టైమ్.. 15 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ లెక్కన టీటీడీ డాలర్ల చోరీ జరిగిందని మరోసారి అంగీకరించారు మాజీ సీఎం.