Suicide Cases: స్వేచ్ఛ బ్యూరో: సమాజంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ,ప్రేమ వైఫల్యాలు, మద్యానికి బానిస కావడం వంటి అనేక కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో మనిషి పుట్టుక పుట్టి జీవితాన్ని సాధించలేక విలువైన జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు. తరచూ ఫోన్ చూడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించారని చదువుకోమని చెప్పారంటూ విద్యార్థులు తెలిసి తెలియని వయసులో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైందని, ఆన్లైన్ చాటింగ్ లో నష్టపోయామంటూ యువకులు, భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా, మద్యానికి బానిసై ఆరోగ్యం చెడిపోయిందంటూ మధ్య వయస్కులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి.
చిన్నపాటి కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి ఈ ఆరు నెలల వ్యవధిలోనే ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు తీసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. బాధితుల క్షణికావేశ నిర్ణయాలతో ఆయా కుటుంబాల్లో చీకట్లు నిండుతున్నాయి. దీంతో వారి కుటుంబాలతో పాటు పిల్లలు రోడ్డున పడుతున్నారు. పెద్ద దిక్కుని కోల్పోయి చదువు దూరం అవుతున్నారు. తల్లిదండ్రులతో పాటు నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి తీరని వేదనను మిగుల్చుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గత ఆరు నెలల వ్యవధిలోనే 40 మంది ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళనను కలిగిస్తోంది.
Also read: Tirumala Timings: తిరుమలలో మారిన టైమింగ్స్ – బ్రేక్ దర్శనాలు రద్దు
బాధితుల్లో ఎక్కువగా మూడు పదుల వయసులోపు ఉన్నవారే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికంగా నష్టపోవడం కుటుంబ గొడవల్లో క్షణికావేశానికి గురి అవ్వడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సమాజంలో తోటి వారితో బెరిజులు వేసుకుంటూ తమ జీవన శైలిపై అనేక అనుమానాలు అభద్రతాభావంతో ఆత్మహత్యాయత్నం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు చెబుతున్నారు. జీవితంలో అన్ని ఒడిదుడుకులు చూసిన వృద్ధులు కూడా కుమారులు కోడలు తిట్టారని,సరిగ్గా పట్టించుకోవడం లేదని ఊపిరి తీసుకుంటున్నారు. భర్తతో వాగ్వివాదాలు, ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాలతో మహిళలు, పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
భూ తగాదాలలో బిజ్వారం గ్రామానికి చెందిన మల్లేష్ తన వదినపై చేసిన దాడి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లగా తన బంధువైన శేషన్నతో ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్నాడని కాల్ డేటా ఆధారంగా అనుమానించిన పోలీసులు విచారణ చేయగా ఆ విచారణలో తనపై విచక్షణారహితంగా కొట్టారనే కారణంతో ఆ ఈనెల 5 న మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రైతు శేషన్న తన పొలం దగ్గరే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా గత నెలలో కేటి దొడ్డి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు చింతలకుంట గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహ నిశ్చితార్థం కాగా వారానికే కాబోయే వరుడు అనుమానిస్తున్నాడనే కారణంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 6న ఐజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన సత్యం ఐజలో బైక్ మెకానిక్ గా కొనసాగుతూ ఆర్థిక ఇబ్బందులతో తన గ్రామంలోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది.
Also Read: Property Tax: ట్యాక్స్ కలెక్షన్స్ పై యాక్షన్ షురూ.. నలుగురు బిల్ కలెక్టర్ల పై సస్పెన్షన్ వేటు