BigTV English

Jagan in Bangalore: జగన్ మళ్లీ బెంగుళూరు ఎందుకు.. మకాం మార్చినట్టేనా?

Jagan in Bangalore: జగన్ మళ్లీ బెంగుళూరు ఎందుకు.. మకాం మార్చినట్టేనా?

Jagan in Bangalore: వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ బెంగుళూరుకు మకాం మార్చారా? అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టినట్టేనా? పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? జాతీయ రాజకీయ పార్టీల నేతలతో మంతనాలు కోసమే బెంగుళూరు వెళ్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.


జగన్ నిర్ణయాలు పార్టీ నేతలకు అంతుబట్టదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీక నేతలు షాకైన సందర్భాలు లేకపోలేదు. అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. నేతలు ఓకే అంటారో తప్పా.. నో అన్న సందర్భాలు అస్సలు లేవు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అయితే పులివెందుల లేదంటే బెంగుళూరులో మాత్రమే ఉంటున్నారాయన.

సోమవారం నుంచి తాడేపల్లిలో తన క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుటికే పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా పార్టీలోని దిగువ శ్రేణి నేతలతో కలిసే ఈ కార్యక్రమాన్ని రూపొందించింది ఆ పార్టీ. అయితే ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తోంది.


సోమవారం బెంగుళూరు వెళ్తున్నారు మాజీ సీఎం జగన్. వారం రోజులపాటు అక్కడే ఆయన ఉండనున్నా రు. వివిధ పార్టీల జాతీయ నేతలతో ఆయన మంతనాలు సాగించే అవకాశముందని తెలుస్తోంది. పాత కేసులు బయటకు రాకుండా, కొత్త కేసులు నమోదు కాకుండా ఉండేలా ఆయన స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగుళూరులో ఉన్న బీజేపీ నేతలతో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నట్లు పార్టీ అంతర్గత సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బెంగుళూరుకు వెళ్తున్నట్లు సమాచారం.

ALSO READ: విజయసాయి రెడ్డితో నాకున్న పరిచయం ఇదే: అధికారిణి శాంతి వివరణ

జూన్ 24న బెంగళూరు వెళ్లారాయన. ఈనెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు. ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభం నాటికి ఆయన వస్తారా? లేదా అన్నది డౌట్ గానే ఉందని ఆ పార్టీ నేతల చెబుతున్నమాట. ఆ పార్టీ నేతగా ఇప్పటివరకు ఎవర్నీ ఎన్నుకోలేదు. దీంతో ఆ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

Tags

Related News

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

Big Stories

×