Jagan going to Delhi(Latest political news in Andhra Pradesh): వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అవుతుందా? వైసీపీ తలపెట్టిన మహా ధర్నాకు జాతీయస్థాయి నేతలు హాజరవుతారా? ఆ పార్టీ నేతలు కలిసిరావడం లేదా? అసెంబ్లీ సమావేశాల ను డుమ్మా కొట్టేందుకు జగన్ ఈ స్కెచ్ వేశారా? జగన్ కార్యక్రమానికి వాతావరణం అనుకూలిస్తుందా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.
మంగళవారం ఉదయ తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మాజీ సీఎం జగన్. గన్న వరం నుంచి ఎయిరిండియా విమానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఢిల్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నేతల ను ఆహ్వానించారు వైసీపీ నేతలు. పార్లమెంటు సమావేశాలు ఉండడంతో వస్తామని చెప్పలేకపోయారట.
మరోవైపు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ ఎంపీలు జాతీయస్థాయి నాయకులను ధర్నాకు రప్పించే పనిలోపడ్డారట. నార్మల్‌గా మహాధర్నాను భారీ ఎత్తున చేయాలని వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేశారట. ఏపీ నుంచి రైళ్లలో అభిమానులు, కార్యకర్తలను తరలించాలని ప్లాన్ చేశారట.
ALSO READ: వైసీపీ నుంచి చేరికలు.. మంత్రి లోకేష్‌తో బీజేపీ ఎమ్మెల్యేల ముచ్చట్లు
మహా ధర్నాకు వైసీపీ నేతలెవరూ ముందుకు రాకలేదని సమాచారం. నిధుల విషయంలో నేతలంతా వెనక్కి తగ్గినట్టు పార్టీ ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో తూతూమంత్రంగా చేయాలని డిసైడ్ అయ్యారట జగన్. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేతలు ఎవరూ బయటకురాలేదు. కేవలం ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల నేతలు మాత్రమే జగన్ వెంట కనిపిస్తు న్నారు. మిగతా నేతలంతా దూరంగా ఉన్నారు.
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు ఢిల్లీలో ధర్నాకు పిలుపు ఇవ్వడాన్ని వైసీపీలోని చాలామంది నేతలు తప్పుబడుతున్నారు. దీనివల్ల ఏపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందని భావిస్తు న్నారు. కూటమి ప్రభుత్వానికి కనీసం రెండు లేదా మూడేళ్లు సమయం ఇచ్చి అప్పుడు ఢిల్లీలో ఆ తరహా కార్యక్రమాలు చేస్తే బాగుండేదని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు జగన్ ధర్నాకు కాలం కూడా కలిసిరాలేనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఐదు రోజులపాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. ఇలాంటి సమయంలో ధర్నాలు పెట్టడం కరెక్ట్ కాదని, వింటర్‌లో పెట్టినా బాగుండేదని అంటున్నారు.
తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్
గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న జగన్
రేపు ఢిల్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నారు. #YSJagan #AndhraPradesh #YCP #TDP #delhi… pic.twitter.com/cVWfYX4kdc
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2024