Harshit Rana: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 3rd ODI) మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ శుభమాన్ గిల్ ను కాదని, రోహిత్ శర్మ ఇచ్చిన సూచనలు తీసుకొని హర్షిత్ రాణా సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మూడవ వన్డే మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు హర్షిత్ రాణా. ఈ మ్యాచ్ లో మిచెల్ ఓవెన్ వికెట్ తీసే క్రమంలో కూడా ఆఫ్ సైడ్ బంతి వేయాలని హర్షిత్ కు చెప్పాడు రోహిత్. దానికి తగ్గట్టుగానే బంతి వేసి, సక్సెస్ అయ్యాడు హర్షిత్ ( Harshit Rana). ఇక ఆ సందర్భంగా మిచెల్ ఓవెన్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ శర్మనే అందుకున్నాడు.
ముఖ్యంగా 47వ ఓవర్ లో రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు పాటించి, అదే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టాడు హర్షిత్ రాణా. ఈ 47వ ఓవర్ లో కూపర్ కొన్నోలీ, జోష్ హేజిల్‌వుడ్ వికెట్లను పడగొట్టాడు హర్షిత్. ఈ రెండు వికెట్లు పడగొట్టకపోయింటే, ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసేది. ఈ నేపథ్యంలో హర్షిత రాణాకు ( Harshit Rana) రోహిత్ శర్మ ఇచ్చిన సలహాల వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలి రా అంటూ రోహిత్ శర్మను మెచ్చుకుంటున్నారు. అలాంటి రోహిత్ శర్మను తొలగించి, గిల్ చేయడం దండగే అంటున్నారు. సీనియర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఫాలో అవుతూ వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని శుభమన్ గిల్ కు చురకలు అంటిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఒకవేళ సూచనలు తీసుకోకపోతే, అన్ని సిరీస్ లు టీమిండియా ఓడిపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక అటు గిల్ మాట వినని హర్షిత్ రాణా, రోహిత్ శర్మ మాట విని సక్సెస్ అయ్యాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ శుభమాన్ గిల్ ఆచితూచి వ్యవహరించారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో…శుభమాన్ గిల్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లారు. సీనియర్లు అయిన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ సలహాలు తీసుకొని శుభమాన్ గిల్ వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ సందర్భంగా శుభమాన్ గిల్ కు చాలా సలహాలు ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఒకవేళ వినకపోతే.. పక్కకు లాగి మరి సూచనలు చేశాడు. అటు రోహిత్ శర్మ కూడా ఇదే తరహాలో శుభమాన్ గిల్ కు సలహాలు ఇవ్వడం జరిగింది. దీని ఫలితమే ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా సక్సెస్ అయిందని చెప్పవచ్చు.
Get yo ass here, Captain 😭😭😭#AUSvINDpic.twitter.com/p2K2MJACsd
— Kanishk (@jeene2yarr) October 25, 2025
We are not wrong when we say that Rohit Sharma is the best captain.
Rohit gave some tips to Harshit and the wicket came in the same over.
The greatest leader rohit sharma leading from the front 🔥🥶 pic.twitter.com/AnAXenFWB1
— Sohamdave (@sohamdave45) October 25, 2025